గ్రేటర్‌లో గులాబీశ్రేణుల ఫైర్


Tue,March 13, 2018 04:49 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అంసెంబ్లీలో సోమవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెడ్ ఫోన్స్ విసిరి దాడి చేసిన నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడ టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కందాడి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మన్నెగూడ చౌరస్తా లో సాగర్ రహదారి పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలోని బాలాజీనగర్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సాధు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో అలాగే రామంతాపూర్ ప్రధాన రహదారిలో రామంతాపూర్ డివిజన్ టీఆర్ ఎస్ అధ్య క్షుడు రేపాక కుమారస్వామి కోమటిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. శామీర్‌పేట ప్రధా న చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి చౌరస్తాలో డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సయ్యద్ ఎజాస్ ఆధ్వ ర్యంలో దిష్టిబొమ్మకు కాంగ్రెస్ నేతల చిత్ర పటాలను ఏర్పాటు చేసి చెప్పుల దండను వేసి స్థానికంగా ఊరేగించి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దుశ్ఛర్యలకు కొనసాగింపుగా సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రథమ పౌరుడు రాష్ట్ర ప్రగతి గురించి ప్రసంగిస్తున్న సమయంలో యావత్ దేశం సిగ్గుపడే లా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పీకర్ స్వామిగౌడ్‌పై దాడి చేసి కంటిని గాయపరచడం వారి నీచ సంస్కృతికి నిదర్శనమని, దాడికి పాల్పడిన కోమటిరెడ్డిని అన ర్హుడుగా ప్రకటించి జైల్లో పెట్టాలని టీఆర్‌ఎస్ పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర నాయకులు మాధ వరం నర్సింహరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అగౌరప రుస్తున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మండిపడ్డారు.

హస్తినాపురం చౌరస్తాలో రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక శాసనసభలో రౌడీ యిజం ప్రదర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను మల్కాజిగిరి చౌరస్తాలో టీఆర్‌ఎస్ నాయకులు దహనం చేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్‌లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ నాయకత్వంలో కోమటిరెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. టీఆర్ ఎస్వీ నాయకుడు శివరాం గుప్తా ఆధ్వర్యంలో విద్యార్థి శ్రేణులు ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు చౌరస్తా వద్ద కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీ గౌరవానికి భంగం కల్గించడమే కాక స్వామి గౌడ్‌కు గాయాలు కావడానికి కారణ మైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు.

431
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...