మీడియా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడొద్దు


Tue,March 13, 2018 04:48 AM

-సెన్సిటివ్ అంశాలను సెన్సేషన్ కోసం చిత్రీకరిస్తున్నారు
-పోలీసు అధికారిణి సునిత విషయంలో అదే జరిగింది
-పలు మహిళా సంఘాల నాయకురాళ్లు
ఖైరతాబాద్, మార్చి 12 : ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి మీడియా తొంగిచూడటం సరికాదని పలువురు మహిళా సంఘం నాయకురాళ్లు కోరారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక ఉద్యమకారిణి లలిత, సీనియర్ జర్నలిస్టు సజయ, పీఓడబ్ల్యూ నేత సంధ్యతో కలిసి ఇటీవల పోలీసు అధికారిణి సునిత విషయంలో మీడియా వైఖరిని ప్రశ్నించారు. ఆమె ఇంట్లోని బాత్‌రూమ్, బెడ్ రూమ్‌లలో ప్రవేశించి ఓ మీడియా (టీ న్యూస్ కాదు) పదే పదే ఆ ఘటనను ప్రదర్శించడం సరికాదన్నారు. చట్టం ప్రకారం స్వగృహం అనేది ఓ ప్రైవేట్ స్థలమని, అందులో ఎవరితోనైనా ఉండవచ్చని, అలాంటి క్రమంలో ఓ ఘటనను వార్తగా ఎలా చిత్రీకరిస్తారని ప్రశ్నించారు. సెన్సిటీవ్ విషయాలను వార్తాకథనాలుగా చూపించడం వల్ల చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని, మరికొన్ని టీవీ చానెళ్లలో వ్యక్తిగత కుటుంబ సమస్యలను ప్రదర్శిస్తున్నారని, ఇలాంటి కథనాలు సెన్సేషన్ ఎలా? అవుతాయన్నారు. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, అలాంటి వాటిని వదిలివేసి వ్యక్తిగత జీవితాలను వార్తలుగా చూపించడాన్ని మానుకోవాలని సూచించారు. గతంలో పక్కింటి వారు చూస్తారేమోనన్న భయం కలిగేదని, నేడు సామాజిక మాధ్యమాలను చూసి భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. త్వరలోనే అన్ని చానళ్ల ఎడిటర్లను కలిసి ఇలాంటి వార్తలపై ప్రశ్నిస్తామని, జాతీయ బ్రాడ్ కాస్టింగ్ అథారిటీ, కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

393
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...