ఉత్తమ ఇంకుడు గుంతలకు పురస్కారాలు


Tue,March 13, 2018 04:47 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టి నీటి పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని సత్కరించాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు ఓఆర్‌ఆర్ లోపల పరిధి మేర అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీ, కాలనీ వాసుల నుంచి నామినేషన్లను ఆహ్వానించారు. బహుమతులను మూడు విభాగాలుగా విభజించడం జరిగిందని ఈ సందర్భంగా సోమవారం అధికారులు తెలిపారు. ప్రతి జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో ఒక్కో సర్కిల్‌లో ఒక ఉత్తమ అపార్ట్‌మెంట్‌కు బహుమతి ప్రదానం చేయనున్నారు. దాంతో పాటు జలమండలిలోని నాలుగు సర్కిళ్ల పరిధిలో ఒక్కో సర్కిల్‌కు ఒక ఉత్తమ గేటెడ్ కమ్యూనిటీకి పురస్కారం అందజేస్తామని తెలిపారు. వీటితో పాటు జలమండలిలోని రెండు ఆపరేషన్స్ డైరెక్టర్ పరిధిలో ఉత్తమ కాలనీకి పురస్కారం ప్రదానం చేయనున్నారు.

15లోగా దరఖాస్తులు సమర్పించండి
ఇంటి యాజమానులు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ ప్రతినిధులు వారు నిర్మించిన ఇంకుడు గుంతల ఫొటోలతో గేటెడ్ కమ్యూనిటీ, కాలనీ, అపార్ట్‌మెంట్, గెటేడ్ కమ్యూనిటీ పేరు, జీహెచ్‌ఎంసీ సర్కిల్, జలమండలి డివిజన్ నంబరు, ఇంకుడు గుంత నిర్మించిన ప్రదేశం, ప్రతినిధి పేరు, కాంట్రాక్ట్ నంబరు, ఎన్ని ఇంకుడు గుంతలు నిర్మించారనే సమాచారాన్ని నింపి ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారికి నేరుగా నామినేషన్లను అందజేయవచ్చన్నారు. లేదా adgw102 @gmail.comకు ఈ నెల 15లోపు మెయిల్ చేయవచ్చన్నారు. మరింత సమాచారం కోసం 99899 85102లో సంప్రదించాలన్నారు. ఈ నెల 22న ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉత్తమ ఇంకుడు గుంతలను నిర్మించిన వారికి బహుమతుల ప్రదానం ఉంటుందని అధికారులు తెలిపారు.

277
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...