ఒవైసీ జంక్షన్‌కు గ్రీన్‌సిగ్నల్


Fri,February 23, 2018 01:31 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నల్గొండ క్రాస్‌రోడ్డు నుంచి ఒవైసీ జంక్షన్ వరకు నాలుగు లేన్ల ైఫ్లెఓవర్ నిర్మాణానికి బల్దియా స్థాయీ సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ. 523.37కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. నల్గొండ క్రాస్‌రోడ్స్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్‌ల మీదుగా ఒవైసీ జంక్షన్ వరకు దీన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది వరకే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమయ్యాయి.స్థాయీసంఘం కూడా ఆమోదం తెలుపడంతో ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు తీసుకొని టెండర్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం స్థాయీసంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జియాగూడలో ఆధునిక కబేళా నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించారు.

స్థాయీ సంఘం తీర్మానాలివీ..
-జియాగూడలో డీఎఫ్‌బీవోవోటీ పద్ధతిలో పీపీపీ విధానంలో అత్యాధునిక కబేళాను నిర్మాణం కోసం రూపొందించిన ప్రతిపాదనకు ఆమోదం. పరిపాలనా అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక.
-మౌలా కా చిల్లా- హైదరాబాద్ ఇస్లామిక్ స్కూల్ వయా గంగానగర్ మార్గంలో ఓపెన్ డ్రైన్ స్థానంలో సుమారు రూ. 5.95కోట్లతో ట్విన్ బాక్స్ డ్రైన్‌గా ఆధునికీకరణ
-వజీర్ అలీ మసీద్-దూద్‌బౌలీ పోలీస్‌స్టేషన్ మధ్య రోడ్డు రూ. 5.13 కోట్లతో 60 అడుగుల మేర విస్తరణ.
-హిమ్మత్‌పుర నుంచి ఫతే దర్వాజ జంక్షన్ వరకు రూ. 5.96 కోట్ల వ్యయంతో 80 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా సంబంధిత ఆమోదం.
-దూద్‌బౌలీ పోలీస్‌స్టేషన్ నుంచి హుస్సేనీఆలం వరకు 60 ఫీట్ల రోడ్డు విస్తరణ, రూ. 5.01 కోట్లతో సీసీ రోడ్డు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం.
-ఫతేదర్వాజ నుంచి చందూలాల్ బారాదరి వరకు ప్రతిపాదిత 80 ఫీట్ల రోడ్డు విస్తరణలో భాగంగా రూ. 5.40 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం
-బాలాపూర్ నుంచి హఫీజ్‌బాబా నగర్ సీ-బ్లాక్ నుంచి డీఆర్‌డీవో కంపౌండ్‌వాల్ వరకు 60 ఫీట్ల రోడ్డు విస్తరణలో భాగంగా రూ. 5.95కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు, ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు.
-ఎన్‌ఎఫ్‌సీ రైల్వే బ్రిడ్జి నుంచి గ్రీన్‌హిల్స్ కాలనీ, శివహోటల్ నుంచి మాణిక్‌చంద్ రోడ్డును 100ఫీట్లమేర విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోతున్న 267 మందికి పరిహారం చెల్లింపు ప్రతిపాదనకు ఆమోదం.
-శివమ్ జంక్షన్ నుంచి జామై ఉస్మానియా ైఫ్లెఓవర్, తార్నక జంక్షన్ మీదుగా లాలాపేట్ ైఫ్లెఓవర్ వరకు 120ఫీట్ల మేర రోడ్డు విస్తరణలో ఆస్తుల సేకరణ.
-ప్రియదర్శిని హోటల్ మేడ్చల్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, దుబాయ్ గేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణకుగాను 345 ఆస్తుల సేకరణ ప్రతిపాదన.
-కావూరీ హిల్స్ నుంచి గుట్టల బేగంపేట్ రవీందర్ కో-ఆపరేటివ్ సొసైటీ వరకు 60 ఫీట్లమేర రోడ్డు విస్తరణకు ప్రతిపాదన.
-ఓల్డ్ మలక్‌పేట్ వాటర్ ట్యాంక్ రోడ్ టీ-జంక్షన్ వద్ద 60 ఫీట్ల మేర రోడ్డు విస్తరణలో భాగంగా 30 ఆస్తుల సేకరణ.
-బండ్లగూడ కల్స వద్ద నిర్మాణంలో ఉన్న మల్టీపర్పస్ స్టేడియం అసంపూర్తి పనులను రూ. 5.99 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం.
-ఉప్పల్ జంక్షన్ నుంచి నల్లచెరువు వరకు మొదటి దశలో 150 ఫీట్ల రోడ్డు విస్తరణకు ఆమోదం.
-ఖాయిలాపడిన హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ కంపెనీకి ఆస్తిపన్ను బకాయిలో వడ్డీ మాఫీచేయాలన్న కంపెనీ విజ్ఞప్తిని ప్రభుత్వానికి పంపాలని నిర్ణయం. ఈ కంపెనీ రూ. 6,54,24,470కోట్లు బకాయిపడింది.
-జవహర్‌నగర్‌లోని మల్కారం చెరువు నుంచి వచ్చే వ్యర్థజలాల శుద్ధీకరణకు రూ. 5.59కోట్లతో ప్లాంటు ఏర్పాటుకు స్వల్పకాలిక టెండర్ ఆహ్వానం.
-జవహర్‌నగర్‌లోని హరిదాసుపల్లి, రాజీవ్ గృహకల్ప రోడ్ సమీపంలోని తొమ్మిదో కుంట నుంచి వచ్చే ద్రవ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు రూ. 5.59కోట్లతో మొబైల్ శుద్ధీకరణ ప్లాంటును మూడు నెలల పాటు ఏర్పాటు చేసేందుకు ఆమోదం
-ఎస్టేట్ విభాగంలో ఇద్దరు, స్పోర్ట్స్ సెక్షన్‌లో ఒకరు విశ్రాంత అధికారుల కాంట్రాక్ట్ కాలన్నీ మరో మూడు నెలలపాటు పొడిగింపు.

1257
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...