క్షమాభిక్ష జీవో విడుదల చేసేందుకు చర్యలు


Fri,February 23, 2018 01:25 AM

-ఖైదీల ముగింపు క్రీడోత్సవాల్లో నాయిని నర్సింహారెడ్డి
చర్లపల్లి:రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష జీవోను త్వరలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో నాలుగో రాష్ట్ర స్థాయి ఖైదీల క్రీడల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జైళ్ల శాఖలో ఖైదీల సంక్షేమం కోసం పలు సంస్కరణలు చేపట్టామని, ముఖ్యంగా క్రీడలు ఖైదీల్లో మనసికొల్లాసం కలిగించడంతో పాటు వారిలో ధైర్యం నింపేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో స్నేహ పూర్వక వాతవరణం పెంపొందించేందుకు క్రీడలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిర్వహించిన క్రీడలు దేశంలోనే మొదటిసారని, ఈ ఘనత తెలంగాణ జైళ్ల శాఖకే దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఖైదీల సంక్షేమంతో పాటు క్షమాభిక్ష ప్రసాదించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఇప్పటికే క్షమాభిక్ష విషయమై ఉన్నతాధికారులతో కమిటీ వేశామని, త్వరలో క్షమాభిక్ష వస్తుందన్నారు. గతంలో లేని విధంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉన్నతాధికారుల కమిటీ నివేదిక అధారంగా ఖైదీలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా వివిధ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైలులో వంద పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయడంతో పాటు పది వేల మంది ఖైదీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఖైదీలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారు జైలు నుంచి విడుదల అనంతరం ఆయా రంగాల్లో స్థిరపడేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఖైదీలకు సన్న బియ్యం భోజనం :డీజీ వినయ్‌కుమార్‌సింగ్
ఖైదీలకు మార్చి 1 నుంచి సన్నబియ్యంతో అహారం అందించేందుకు కృషి చేస్తున్నామని జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ పేర్కొన్నారు. వివిధ జైళ్లలో సంస్కరణలను ప్రవేశపెట్టి ఖైదీల్లో మార్పు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలో మహా పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. ఖైదీల కోసం జైలు చేపడుతున్న సంస్కరణలు, విద్యాధాన్‌యోజన, మహాపరివర్తన, ఉన్నతి వంటి సంస్కరణలు చేపట్టి ఖైదీల్లో మార్పు తీసుకురావడంతో పాటు నేరాలను తగ్గించేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, క్యారమ్స్, అథ్లెటెక్స్‌లో హైదరాబాద్ రేంజ్ విజయం సాధించాయి. చెస్‌లో ఖైదీ గణేశ్ గెలుపొందగా వరంగల్, హైదరాబాద్ రేంజ్ నుంచి సుమారు 85మంది ఖైదీలు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. 42 మంది హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నుంచి గోల్డ్‌మెడల్స్‌ను అందుకున్నారు.

అనంతరం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ నర్సింహ, హైదరాబాద్ రేంజ్ డీఐజీ సైదయ్య, వరంగల్ రేంజ్ డీఐజీ కేశవనాయుడు, చర్లపల్లి, చంచల్‌గూడ జైలు పర్యవేక్షణాధికారులు ఎం.ఆర్.భాస్కర్, అర్జున్‌రావు, ఉప పర్యవేక్షణాధికారులు చింతల దశరథం, దరశథరామిరెడ్డి, సంతోశ్‌కుమార్‌రాయ్, కీసర ఆర్డీవో హనుమంత్‌రెడ్డి, జైలు అధికారులు డాక్టర్ శ్రీనివాస్, దేవలానాయక్, రత్నం, శోభన్‌బాబు, రామయ్య, శ్రీమాన్‌రెడ్డి, మొగిలేశ్, దేవిసింగ్, హనుమాన్‌ప్రసాద్, స్వామి, జనార్దన్‌రెడ్డి, సంజీవరెడ్డి, సత్తయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

265
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...