పాతబస్తీకి..కొత్త సొబగులు


Thu,February 22, 2018 03:42 AM

-తాగు, మురుగునీటి వ్యవస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి
-8 నియోజకవర్గాలకు రూ. 40 కోట్లు మంజూరు
-623 పనుల్లో 521 పనులకు జలమండలి టెండర్ల ఆహ్వానం
-మే నెలాఖరు నాటికి పూర్తి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పాతనగర పరిధిలోని నియోజకవర్గ ప్రజలకు జలమండలి మెరుగైన సేవలకు శ్రీకారం చుట్టింది. నిజాం కాలం నాటి పైపులైన్ వ్యవస్థ ఒకవైపు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బందులు పడుతున్న ఇక్కడి ప్రజలకు సర్కారు అభివృద్ధి వరాలను ప్రకటించింది. పాతబస్తీలోని ఎనిమిది నియోజకవర్గాల ప్రజలకు సమృద్ధిగా తాగునీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుకు నడుం బిగించింది. ఈ మేరకు తాగు, మురుగునీటి పైపులైన్ వ్యవస్థల అభివృద్ధికి గానూ ఒక్కో నియోజకవర్గానికి గానూ రూ.5 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో నెం. 801ని జారీ చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాగు, మురుగునీటి పైపులైన్ల పరిధిని మెరుగుపర్చాలంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిధులను విడుదల చేశారు. 2017-18 సంవత్సరం ఎస్‌డీఎఫ్ (స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్) కింద విడుదలైన రూ.40 కోట్ల నిధులతో ఎనిమిది నియోజకవర్గాల్లో 623 చోట్ల తాగు, మురుగునీటి వ్యవస్థ బలోపేతం చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు 521 చోట్ల పనులకు సంస్థ ఎండీ దాన కిశోర్ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఎండీ ఆదేశాల మేరకు ఓ అండ్ ఎం సర్కిల్ 1, 3 పరిధిలోని ఈ పనులకు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం అధికారులు టెండర్లను ఆహ్వానించారు. రాబోయే మే నెల చివరి నాటికి ఈ పనులను పూర్తి చేయనున్నామని, వర్షాకాలం ప్రారంభం నాటికల్లా తాగు, మురుగునీటి వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నామని అధికారులు తెలిపారు.

669
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...