చిలుకానగర్ నరబలి కేసు నిందితుడు రాజశేఖర్ విచారణ


Thu,February 22, 2018 03:35 AM

ఉప్పల్, (నమస్తే తెలంగాణ) : చిలుకానగర్ నరబలి కేసు నిందితుడు, క్యాబ్‌డ్రైవర్ రాజశేఖర్‌ను ఉప్పల్ పోలీసులు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. రాజశేఖర్ నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నరబలి నేపథ్యంలో మొండం లభించకపోవడం, చిన్నారిని తీసుకువచ్చిన తల్లిదండ్రుల ఆచూకీ తెలియకపోవడంతో కేసు సందిగ్ధంగా మారిం ది. కేసును పూర్తిస్థాయిలో ఛేదించి, దోషులను శిక్షించే విధంగా పోలీసులు రాజశేఖర్‌ను మరోసారి విచారిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు చిన్నారి తల్లిదండ్రులు, మొండెం పైన ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తుంది. నరబలి జరిగిందనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు పై రెండు విషయాలు అంతుచిక్కని సమస్యగా మారాయి. దీంతో ఉప్పల్, ఎస్‌ఓటీ పోలీసులు వీటిపై సమగ్ర విచారణ చేస్తున్నారు. మూడురోజుల్లో కేసులో పురోగతి సాధించేదిశగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. రాజఖేఖర్ చెప్పే సమాధానం ఆధారంగా కేసును పూర్తి స్థాయిలో ఛేదించనున్నారు.

502
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...