హత్యాయత్నం కేసులో ఇద్దరు రిమాండ్


Thu,February 22, 2018 03:33 AM

పేట్‌బషీరాబాద్ : మద్యం మత్తులో హత్యాయత్నం చేసిన ఇద్దరు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఐ దుర్గాప్రసాద్, ఎస్సై శ్రీనాథ్‌ల కథనం ప్రకారం.. ఈనెల 18న రాత్రి శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ప్రశాంత్, జయరాంనగర్‌కు చెందిన షేక్ గౌస్(23), మంగోళి మహేశ్(19)లు భాగ్యలక్ష్మికాలనీలోని బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించారు. తాగిన మత్తులో మాటమాట పెరగడంతో ప్రశాంత్ తలపై గౌస్, మహేశ్‌లు బండరాయితో మోది హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గౌస్, మహేశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...