రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


Thu,February 22, 2018 03:32 AM

మేడ్చల్, నమస్తే తెలంగాణ: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా, రా మాయంపేట మండలం, అక్కన్నపేట గ్రామానికి చెందిన చిట్టిపల్లి సిద్ధిరాంరెడ్డి, భార్య మమత(45)లు నగర శివారులోని కొంపల్లిలో బంధువుల ఇంట్లో శుభాకార్యానికి బుధవారం ఉదయం 9. 30 గంటలకు ఇంటి నుంచి బైక్‌పై బయలు దేరారు. మేడ్చ ల్ పట్టణంలోని బస్ డిపోముందు 44 జాతీయ రహదారిపై వెళ్తుండగా 11.30 గంటల సమయంలో ఆర్మూ ర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మమత రోడ్డుపై పడిపోగా... అదే సమయంలో వెనుకనుంచి వచ్చిన లారీ ఆమె పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సిద్ధింరాంరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ దవాఖానలోని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరబ్రహ్మం తెలిపారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...