ఎకోఫ్రెండ్లీ రహదారి


Wed,February 21, 2018 03:34 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జర్మనీ టెక్నాలజీతో నెక్లెస్‌రోడ్‌లో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను నగర మేయర్ బొంతు రామ్మోహన్ మంగళవారం పరిశీలించారు. లుంబినీ పార్కు రోడ్ నుండి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు రూ.2.50 కోట్లతో జర్మనీ సంస్థ ఉచితంగా నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశంలోని ఇతర నగరాల్లో ఇంజినీరింగ్ పనులలో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి హైదరా బాద్ నగరంలో చేపడుతున్న పనులకు ఉపయోగించనున్నట్టు పేర్కొన్నారు. సెక్రటేరియట్ సమీపంలో 3.80 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రోడ్డు ఎకోఫ్రెండ్లీగా ఉంటుందన్నారు.

ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్ మెటీరియల్‌నే తిరి గి ఉపయోగిస్తున్నందున సహజ వనరుల ఉపయోగం కూడా పూర్తిగా తగ్గు తాయని మేయర్ అన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నగరంలోని రోడ్లు తరచూ దెబ్బతినడం, దెబ్బతిన్న రోడ్లను మరమ్మతుల పేరిట తిరిగి బిటిని వేయడం, దీంతో రోడ్డు ఎత్తు పెరగడం, రోడ్లు ఎగుడు దిగుడుగా మారడం వంటి రోడ్లు తదితర ఇబ్బందులను ఈ ఆధునిక ప్రక్రియతో నిర్మించే రోడ్ల ద్వారా దూరమవుతాయని జర్మనీ ప్రతినిధులు వివరించారని మేయర్ పేర్కొ న్నారు. 20 సంవత్సరాల పాటు మన్నిక ఉండే ఈ రోడ్ల నిర్మాణాన్ని నగ రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వేసే అంశాన్ని పరిశీలిస్తామని మేయర్ రామ్మోహన్ తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణ విధానంపై జర్మనీ ప్రతినిధులు వాలంటైన్, ఖైడోలు మేయర్ రామ్మోహన్‌కు వివరించారు.

507
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...