బైక్ మెకానిక్ డాల్‌పై పీడీ యాక్ట్


Wed,February 21, 2018 03:31 AM

-45 కేసుల్లో నిందితుడు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జైలు నుంచి విడుదలైన తొమ్మిది రోజుల్లో 9 దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అమర్‌రాజా అలియాస్ డాల్‌పై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మంగళవారం పీడీ యాక్ట్‌ను విధించారు. రామంతాపూర్ ప్రాంతానికి చెందిన అమర్‌రాజా బైక్ మెకానిక్. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో చోరీల బాట పట్టాడు. ఇలా.. 2011 నుంచి ఇండ్లలో దొంగతనాలు, ఛైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. అమర్‌రాజా మొత్తం 45 కేసుల్లో నిందితుడి. అందులో 2011, 2013, 2015లలో 27 కేసుల్లో నేరం రుజువై జువైనల్ హోంకు వెళ్లివచ్చాడు.

హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలలోని ప్రాంతాలను అమర్‌రాజా తన చోరీలకు అడ్డగా పెట్టుకున్నాడు. గత ఏడాది జులై 24న అతనిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ ను విధించినప్పటికీ దానిపై కోర్టును ఆశ్రయించి ఆ ఉత్తర్వులను రద్దు చేసుకున్నాడు. దీంతో గత నెల జనవరి 6న జైలు నుంచి బయటికి వచ్చాడు. వచ్చిన తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది దొంగతనాలకు పాల్పడి జనవరి 21న మీర్‌పేట్ పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో అమర్‌రాజా చేష్టల కారణంగా ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యే పరిస్థితి ఉండడంతో శాంతిభ్రదతలను దృష్టిలో పెట్టుకుని రాచకొండ పోలీసు కమిషనర్ అతనిపై పీడీ యాక్ట్‌ను విధించారు. ఈ పీడీయాక్ట్‌పై అమర్‌రాజా చర్లపల్లి జైలులో ఏడాది జైలు శిక్షను అనుభవించనున్నాడు.

218
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...