మా ఆవిడను ఒప్పించి పెండ్లి చేసుకుంటా..


Wed,February 21, 2018 03:30 AM

బంజారాహిల్స్, (నమస్తే తెలంగాణ): మన ప్రేమ విషయం మా ఆవిడకు తెలిసింది.. కొన్ని రోజుల్లో ఆమెను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటా .. అం టూ ప్రియురాలిని మూడేళ్ల పాటు నమ్మించిన ప్రబుద్ధుడు చివరకు ముఖం చాటేశాడు. పెండ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న విషయాన్ని దాచిపెట్టి యువతితో ప్రేమాయణం నడిపి నట్టేట ముంచాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.11 గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్న యువతి(26) మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో రవి అనే వ్యక్తి కూడా అక్కడే పనిచేసేవాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానంటూ పలుమార్లు వెంటపడడంతో యువతి కూడా అంగీకరించింది.

కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకున్నారు. తాను సొంతూరుకు వెళ్లి తల్లిదండ్రులతో పెండ్లి విషయం మాట్లాడివస్తానని రవి వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లిన తర్వాత బిజీగా ఉన్నానంటూ కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన యువతి ఆరా తీయగా అప్పటికే రవికి పెండ్లి అయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తేలింది. ఈ విషయంపై రవిని నిలదీయగా తన భార్యకు ప్రేమ విషయం చెప్పానని, అమె అనుమతితో త్వరలో నిన్ను పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొన్నాళ్లపాటు వేచి ఉండాలని చెప్పాడు.

మూడేళ్లు గడిచినా పెండ్లిమాట ఎత్తకపోగా సంబంధాన్ని కొనసాగించాడు. తనను వదిలేస్తే వేరే పెండ్లి చేసుకుంటానని చెప్పినా వినకుండా ఫేస్‌బుక్ ద్వారా అందరికీ తన భార్య అంటూ షేర్ చేశాడని, గట్టిగా మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి తనను బ్లాక్ మెయిల్ చేశాడని, తనను శారీరకంగా,మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, తనవద్ద డబ్బును లాక్కున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు రవిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

250
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...