మొరాయించిన డీపీఎంఎస్


Tue,February 20, 2018 12:25 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్ ఇంటి అనుమతులకు సంబంధించిన డెవలప్‌మెంట్ పర్మీషన్ మేనేజ్‌మెంట్ సిస్టం(డీపీఎంఎస్) మొరాయించింది. వారం రోజులుగా ఈ విధానం పనిచేయకపోవడంతో అనుమతులు నిలిచిపోయాయి. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్కిల్, జోనల్ స్థాయిలోనే కాకుండా బిల్డింగ్ కమిటీ ఆమోదం తెలిపిన బహుళ అంతస్తుల భవనాల అనుమతులు సైతం నిలిచిపోవడంతో నిర్మాణదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సత్వర, పారదర్శకతతో కూడిన ఇంటి అనుమతుల కోసం డీపీఎంఎస్ పేరుతో జీహెచ్‌ఎంసీలో ఆన్‌లైన్ విధానాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. డీపీఎంఎస్ విధా నం మొరాయించడంతో పర్మిట్ నెంబర్లు జారీకాకపోవడంతో బిల్డింగ్ కమిటీ ఆమోదం తెలిపిన దరఖాస్తులు సైతం పెండింగులో ఉన్నాయి. దరఖాస్తులో అన్నీ సవ్యంగా ఉంటే అనుమతి జారీఅయ్యేసరికి నెలరోజుకుపైగా సమయం పడుతుంది. డీపీఎంఎస్ మొరాయించినందున అనుమతుల ప్రక్రియంతా పూర్తయ్యాక సైతం పెండింగులో ఉండడం విశేషం.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...