రెవెన్యూలో భారీ బదిలీలు


Tue,February 20, 2018 12:25 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జిల్లా రెవెన్యూలో పెద్ద ఎత్తున బదిలీలు చేస్తూ జిల్లా అధి కారులు ఉత్వర్వులు జారీ చేశారు. ఏకకాలంలో డిప్యూటీ తహసీల్దార్లు, టైపిస్టులు, స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్ అసిసెస్టెంట్లకు స్థానచలనం కలిగించారు. మొత్తంగా 50 మంది ఉద్యోగులకు బదిలీ చేయడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున బదిలీలు చేయడం జిల్లా రెవెన్యూలో అరుదుగా చెప్పవచ్చు. చాలా కాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారితో పాటు ఇటీవలే బదిలీ అయిన వారిని సైతం మరలా బదిలీచేశారు. ఇటీవలే సెక్షన్ల వారీగా సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ పనిభారం అధారంగా, ఫైళ్లు ఎక్కువున్న స్థానాలకు ప్రాధాన్యతనిచ్చి బదిలీలు చేసినట్లుగా జిల్లా రెవెన్యూలో ప్రచారం సాగుతోంది. మొత్తంగా బదిలీలు జిల్లా రెవెన్యూలో కలకలం సృష్టిస్తున్నాయి. త్వరలోనే మరికొంత మందిపై బదిలీవేటు పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

సీనియర్ అసిస్టెంట్స్...
కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఎండీ పర్వేజ్‌ఖాన్‌ను హిమాయత్‌నగర్ మండలానికి బదిలీ చే యగా, అక్కడున్న పి. సుష్మా జ్యోతిని కలెక్టరేట్‌కు బదిలీచేశారు. కలెక్టరేట్‌లోనే పనిచేస్తున్న హబీబీ బేగంను ఆర్‌డీవో హైదరాబాద్ డివిజన్‌కు బదిలీచేయగా, అక్కడ పనిచేస్తున్న రామ రాజును కలెక్టరేట్‌లోని E5 సెక్షన్‌కు బదిలీచేశారు. ఆర్డీవో హైదరాబాద్‌లోనే పనిచేస్తున్న ఎన్. శివకుమార్‌ను కలెక్టరేట్ లీగల్ సెల్‌కు, డిప్యూటేషన్‌పై ఆర్డీవో హైదరాబాద్ డివిజన్‌లో పనిచేస్తున్న జె. హరీషాను కలెక్టరేట్‌లోని E2 సెక్షన్‌కు, డిప్యూటేషన్‌పై షేక్‌పేట మండ లంలో పనిచేస్తున్న జి. సునీల్‌ను ఎస్టేట్ ఆఫీస్ సికింద్రాబాద్‌కు, ఆసిఫ్‌నగర్‌లో పనిచేస్తున్న కె. నాగార్జున రెడ్డిని మారేడ్‌పల్లికి, అక్కడ పనిచేస్తున్న సయ్యద్ హజీని ఆసిఫ్‌నగర్‌కు, సైదా బాద్‌లో పనిచేస్తున్న సి. వంశీకృష్ణను షేక్‌పేటకు, అక్కడ పనిచేస్తున్న బి. శ్రీనివాస్‌ను సైదా బాద్‌కు, సికింద్రాబాద్‌లో స్పెషల్ యూడీఆర్‌ఐగా పనిచేస్తున్న జె. ప్రదీప్‌కుమార్‌ను షేక్ పేట మండలంలోని సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీచేశారు.

టైపిస్ట్‌ల బదిలీలు..
ఆసిఫ్‌నగర్ మండలంలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న పి. వెంకటేశ్‌ను షేక్‌పేట మండలానికి బదిలీచేయగా, అక్కడ పనిచేస్తున్న జీకే కుమారస్వామిని ఆర్డీవో సికింద్రాబాద్ డివిజన్‌కు కేటాయించారు. ఆర్డీవో సికింద్రాబాద్ డివిజన్‌లో పనిచేస్తున్న ఇందర్‌కుమార్‌ను అంబర్‌పేటకు బదిలీచేయగా, అక్కడ పనిచేస్తున్న బి. ఆది వెంకట్‌రెడ్డిని సైదాబాద్ మం డలానికి స్థానచలనం కలిగించారు. సికింద్రాబాద్ మండలంలో పనిచేస్తున్న పి. ప్రసన్న లక్ష్మీని ఆసిఫ్‌నగర్‌కు, కలెక్టరేట్‌లో పనిచేస్తున్న వి. పద్మమ్మను సికింద్రాబాద్ మండలానికి బదిలీచేశారు.

స్పెషల్ ఆర్‌ఐలు
ఆసిఫ్‌నగర్ మండలంలో పనిచేస్తున్న ఎం. డేవిడ్‌రాజ్‌ను నాంపల్లి మండలానికి, అక్కడ పనిచేస్తున్న వి. కిష్టయ్యను బదిలీచేసి ఆసిఫ్‌నగర్‌లో పోస్టింగ్ ఇచ్చారు. గోల్కొండ మం డలంలో పనిచేస్తున్న ఫర్హా మహ్మద్‌ను బదిలీచేసి కలెక్టర్‌లో C1 జూనియల్ అసిస్టెంట్‌గా నియమించగా, కలెక్టర్‌లో పనిచేస్తున్న పి. జ్యోతిని గోల్కొండ మండల స్పెషల్ ఆర్‌ఐగా నియమించారు. సికింద్రాబాద్ మండలంలోని జె. శివసత్యప్రసాద్‌ను కలెక్టరేట్ ఔట్‌వార్డ్ సెక్షన్‌కు బదిలీచేయగా, అదే సెక్షన్‌లో పనిచేస్తున్న జీఎస్ శామ్సన్‌పాల్‌ను సికింద్రాబాద్ తహ సీల్దార్‌లో స్పెషల్ ఆర్‌ఐగా నియమించారు. సికింద్రాబాద్ మండలంలో స్పెషల్ ఆర్‌ఐగా పనిచేస్తున్న ఎం. సంగీతరాణిని కలెక్టరేట్‌లోని ఏ3సెక్షన్‌కు బదిలీచేయగా, అక్కడున్న టి. రాజును బహద్దూర్‌పుర మండలంలో జూనియర్ అసిస్టెంట్‌గా బదిలీచేశారు. అదే స్థానంలో పనిచేస్తున్న చిరంజీవిని బదిలీచేసి డిప్యూటేషన్‌పై యూఎల్‌సీ విభాగానికి కేటాయించారు. నాంపల్లి మండలంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె. శ్రవణ్ కుమార్‌ను బదిలీచేసి మారేడ్‌పల్లి మండలంలోని స్పెషల్ ఆర్‌ఐగా పోస్టింగ్ ఇవ్వగా అక్కడ పనిచేస్తున్న హజీరా పర్వీన్‌ను బదిలీచేసి నాంపల్లిలో జూనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ముషీరాబాద్‌లోని సురేష్‌కుమార్‌ను తిరుమలగిరికి బదిలీచేయగా, అక్కడున్న ఎస్ క్రిష్ణను బదిలీచేశారు. ఆర్డీవో సికింద్రాబాద్ డివిజన్‌లో పనిచేస్తున్న ఎస్. రాజశ్రీని బండ్లగూడ మండలానికి డిప్యూటేషన్‌పై కేటాయించారు. డిప్యూటేషన్‌పై బండ్లగూడ మండలంలో పనిచేస్తున్న సునీల్ కుమార్‌ను కలెక్టరేట్ R1 సెక్షన్‌కు కేటాయించగా, కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎంజే సిమ్సన్‌ను బదిలీచేసి E7, E8 సెక్షన్లను కేటాయించారు. కలెక్టరేట్‌లోని జె. అశ్విన్‌కుమార్‌కు B1 సెక్షన్‌ను కేటాయించగా, సంజయ్‌కుమార్‌కు E1 సెక్షన్‌ను, పీవీ వందనను లీగల్‌సెల్‌కు, కె. మంజులకు I 2సెక్షన్‌కు బదిలీచేసి పోస్టింగ్ ఇచ్చారు.

315
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...