ఇంటర్ పరీక్షలకు 193 పరీక్ష కేంద్రాలు


Mon,February 19, 2018 03:49 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమైనారు. ఇప్ప టి కే హైదరాబాద్ జిల్లాల్లోని అన్ని విభాగాల అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సం బంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. దీంతో జిల్లా ఇంటర్ విద్యాశాఖా ధికారులు పరీ క్షలకు హాజరయ్యే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు హాల్ టిక్కెట్ల పంపిణీ, ఓఎంఆర్ బుక్‌లెట్ తదితర పంపిణీకి చర్యలు తీసుకుంటు న్నారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ 74,970.. ద్వితీ య 90,725 మంది విద్యార్థులు చొప్పున పరీ క్షలకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని జిల్లా ఇం టర్మీడియట్ విద్యాశాఖాధికారి జయప్రద బాయి తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యా ర్థులకు కలిపి మొత్తం 193 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య శాఖ ఒక ఏఎన్‌ఎంతో పాటు ప్రథమ చికిత్స బాక్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీ సు బందోబస్తు, ట్రాఫిక్ ఆకాంక్షలు పాటించను న్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద చీఫ్ సూపరిం టెం డెంట్ అధికారిని నియమించారు. ప్రతి పరీక్షా కేం ద్రం సీసీ కెమెరాల నిఘా నీడలో ఉంటుంది.
-ఉ 8 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి
-క్యాలిక్యూలేటర్లు, సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్ పరి కరాలకు అనుమతి లేదు
-ఉదయం 8:30 నుంచి 9ః00గంటల వరకు ప్రతి విద్యార్థిని స్క్రీనింగ్ చేస్తారు.

352
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...