విలువిద్యలో రాణిస్తున్నరహమతున్నీసా బేగం


Mon,February 19, 2018 03:49 AM

చిక్కడపల్లి: కష్ట పడేతత్వం..తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విలువిద్యలో విజయాలు సాధిస్తున్నది నగరానికి చెందిన షేక్ రహమతున్నీసా బేగం.. బాగ్ లిం గంపల్లికి చెందిన చిరు వ్యాపారి నిసార్ అహ్మద్ కుమార్తె అయిన రహ మతు న్నీసాబేగం అబిడ్స్ రోజరీ కాన్వెంట్‌లో 10వ తరగతి చదువుతున్నది. చాలా ఏండ్ల పాటు సాధన చేస్తున్నా ఫలి తం ఉండడం లేదని కొంతమంది అం టుం టారు. కేవలం రెండేండ్ల నుంచి శిక్షణ తీసుకుంటూనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తుండడం విశేషం. 2017 సెప్టెంబర్‌లో ఇబ్రహీం పట్నలో జరిగిన పోటీల్లో బంగారు పతకాన్ని కైవ సం చేసుకుని జాతీయ పోటీ లకు అర్హత సాధించింది. ఈ ఏడాది జనవరి నెలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్.జీ.ఎఫ్.ఐ)ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన నేష నల్ స్కూల్ గేమ్స్ విలువిద్య పోటీల్లో ఒక రజత పతకం తో పాటు రెండు కాంస్య పతకాలను తన అమ్ములపొదిలో వేసుకున్నది. రహమతున్నీసా బేగం మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పతకాలను సాధి స్తున్నానని, ఇందులో తన కోచ్ గంగాధర్ శిక్షణ అద్భుతంగా ఉండడం వల్ల అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నానంది.

197
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...