మనుషులుగా గుర్తించండి


Mon,February 19, 2018 03:49 AM

గోల్నాక: సమాజంలో మేమూ పౌరులమే..ఈ దేశంలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను మాకూ వర్తింపజేయాలి.. మా పై పక్షపాత ధోర ణి విడనాడాలి...మా సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరష్కరించాలి అంటూ హి జ్రా లు, ట్రాన్స్‌జండర్స్ నినాదాలు చేశారు. ఆదివా రం తెలంగాణ హిజ్రా ఇంటర్‌సెక్స్ ట్రాన్స్ జెం డర్స్ సమితి ఆధ్వర్యంలో వందల మంది హిజ్రా లు తమ సమస్యల పరిష్కా రం కోసం కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి అంబర్‌పేట మున్సిపల్ మైదా నం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మై దానం లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయ వ్వవస్థలో ఐపీసీ 377లో సెక్షన్‌లో సవరణలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమానత్వం, చట్టపరమైన రక్ష ణ, స్వేచ్ఛ, వివక్ష నుంచి రక్షణ, లింగ వ్యక్తీకరణకు స్వాతంత్రాన్ని కల్పించాలని వారు కోరారు. విద్య, ఉద్యోగాల్లో ప్రభుత్వ అవకాశాలు కల్పించాలని వారు డి మాండ్ చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు దేశంలో అన్ని రాష్ర్టాలు పా టించాలని కోరారు. హిజ్రాల జనాభాను ప్రభుత్వం అధికారికంగా లెక్కించి వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. సమితి ప్రతినిధులు మా ల, వైజయంతి, చంద్రముఖి, మొనాలిసా, వైభవ్, మానుష్, తాషీ పాల్గొన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...