పట్టపగలు ఇంట్లోకి వెళ్లి స్నాచింగ్


Tue,February 13, 2018 03:33 AM

సీతాఫల్‌మండి : ఇంట్లోకి వెళ్లి మహిళ మెడలోని బంగారు గొలుసు తెంపుకొని పరుగులు తీసిన స్నాచర్‌ను బస్తీ వాసులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉప్పరిబస్తీ గౌరీ రాజమ్మ నిలయం అపార్ట్‌మెంట్ నాల్గవ అంతస్తులో రజని తన కుటుంబసభ్యులతో కలసి నివసిస్తుంది. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంపుకొని పారిపోతుండగా అడ్డుగా వచ్చిన చిన్నారి కళ్లల్లో కారం చల్లి పారిపోయాడు.

బాధితుల కేకలతో టీఆర్‌ఎస్ నాయకుడు చందుతో పాటు కొంతమంది యువకులు బస్తీలోని రహదారులను మూసి వేశారు. దీంతో బయటకు వెళ్లలేక దొంగ ఓ ఇంటిపైకి ఎక్కి మెట్ల కింద దాక్కున్నాడు. స్థానికులు గమనించి దొంగను పట్టుకుని దేహళుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో రాంనగర్ చెందిన ఎ.గురుప్రసాద్(38)గా తేలింది. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసి పలు హోటళ్లలో పనిచేశాడు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం స్నాచింగ్‌కు పాల్పడి పోలీసులకు చిక్కాడు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...