శివరాత్రి సందర్భంగా పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు


Tue,February 13, 2018 03:32 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : శివరాత్రి వచ్చిందంటే చాలు... శైవ క్షేత్రాల్లో భక్తజన సందోహం నెలకొంటుంది. ఉపవాసాలు, జాగరణలతో పరమశివుడిని అత్యంత భక్తీ శ్రద్ధలతో పూజిస్తారు. శివ పార్వతుల కల్యాణం జరిగిన మాఘ బహుళ చతుర్ధశి రోజు శివరాత్రి వస్తుంది. ఆ రోజు ప్రముఖ శైవ క్షేత్రాలకు లక్షలాదిగా జనం తరలి వెళ్తుంటారు. శివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. తెలుగు రాష్ర్టాల్లోని పలు శివాలయాలను సందర్శించుకునే అవకాశం కల్పిస్తోంది.

మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లోని పలు శైవ క్షేత్రాలకు ప్రత్యేక , ఏసీ, నాన్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన టీఎస్‌టీడీసీ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్యాకేజీలను అందిస్తోంది. నగరం నుంచి శ్రీశైలం, వేములవాడ, రామప్ప, కాళేశ్వరం ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్యాకేజీలను వినియోగించుకునేందుకు 9848540371, 040 - 29801039 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. టారిఫ్‌లు... శ్రీశైలం - రూ. 1700 పెద్దలకు, రూ. 1400 పిల్లలకు, వేములవాడ - రూ. 700 పెద్దలకు, రూ. 600 పిల్లలకురామప్ప - రూ. 1000 పెద్దలకు, రూ. 800 పిల్లలకు, కాళేశ్వరం - రూ. 1000 పెద్దలకు, రూ. 800 పిల్లలకు కేటాయించినట్టు టీఎస్‌టీడీసీ తెలిపింది.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...