అభిషేకాల పేరుతో పంచామృతాలెందుకు వృథా?


Tue,February 13, 2018 03:32 AM

-అవి పొందలేని పేదలకు ఇవ్వండి
-కొంతమంది అజ్ఞానులు తప్పుదోవ పట్టిస్తున్నారు
-పవిత్రమైన హృదయంతో దైవాన్ని పూజిస్తే చాలు
-శివం అంటే అనంతంగర్భగుడిలో పెట్టి ఎలా పూజిస్తారు?
-జంబూద్వీప శక్తి పీఠంజగద్గురు భగవతి మహారాజ్ స్వామీజీ
బేగంపేట ఫిబ్రవరి 12 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకోని అభిషేకాలతో పంచామృతాలను వృధా చేయొద్దని వాటిని పొందలేని వారికి అందించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని జంబూద్వీప శక్తి పీఠం శ్రీశ్రీశ్రీ జగద్గురు భగవతి మహారాజ్ స్వామీజీ సూచించారు. సోమవారం సికింద్రాబాద్ యాత్రి నివాస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్రమైన హృదయంతో దైవాన్నీ పూజిస్తే చాలన్నారు. కొంతమంది అజ్ఞానులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇలా పవిత్రమైన పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించాలని కొన్ని విలువైన పూలతో పూజలు చేయాలని చెప్పే మాటలను నమ్మవద్దని తెలిపారు. పంచామృతాలైనా పాలు, నెయ్యి, వెన్న, పెరుగు,తేనే ఎంతో విలువైనవని అభిషేకాల పేరుతో వాటిని నేలపాలు చేయరాదని కోరారు.

దేవుడి పేరుతో వాటిని పొందలేని స్ధితిలో ఉన్న వారికి దానం చేయడం ఎంతో ఉత్తమమైందన్నారు. ఉపవాసాలు కూడా అన్ని మతాల్లో ఉన్నాయని అవి వారంలో ఒకరోజు ఆచరించడం వల్ల జీర్ణవ్యవస్థలకు ఒకరోజు విశ్రాంతి లభించి అవి మరింత బాగా పని చేస్తాయని తెలిపారు. శివం అంటే అనంతమని, దైవానికి గుర్తుగా గతంలో ఊరి మధ్యలో ఓ బొడ్రాయిని పెట్టి పూజించే వారని అన్నారు. శివ లింగాలు ఎప్పుడు బయటి ప్రదేశాలలో ఉంచాలని వాటిని చాలా గుడులలో గర్భగుడిలో ఉంచి పూజలు చేస్తున్నారని అది తప్పని అభిప్రాయ పడ్డారు. మతం పేరుతో అనేక అరాచకాలు జరుగుతున్నాయని , తమ శక్తి పీఠానికి పరమ పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగమేనని పేర్కొన్నారు.

226
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...