ఎఫ్‌వోబీల నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ గ్రీన్ సిగ్నల్


Fri,January 19, 2018 12:17 AM

-తొలి విడుతలో 15 ప్రాంతాలు ఎంపిక
-ఒక్కోదానికి రూ.1.2 నుంచి 1.50కోట్ల అంచనా
-త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ హైదరాబాద్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌వోబి) నిర్మాణాలకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) శ్రీకారం చుడుతున్నది. పాదచారుల ప్రయోజనాల కోసం ఎఫ్‌వోబీ పనులను చేపట్టాలని ఇటీవల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యం లోనే తొలివిడుతలో 15 ప్రాంతాల్లో చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ సన్నద్ధమైంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఒక్కొక్కదానికి రూ.1.2 కోట్ల నుంచి 1.50కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులను వీలైనంత తొందరలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ప్రాంతాల్లోనే ఎఫ్‌వోబీలు నిర్మించేది
ప్రాంతం ఎఫ్‌వోబీ పొడవు
(మీటర్లలో)
ఐడీపీఎల్ బస్టాప్, ప్రశాంత్‌నగర్ 17.80
ముషీరాబాద్ వైపుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద 21.65
మియాపూర్, ఆల్విన్ క్రాస్‌రోడ్ వద్ద 34.40
ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద (ఘట్‌కేసర్ వైపు మార్గం) 13.50
నెక్లెస్‌రోడ్, ఈట్ స్ట్రీట్ పార్కింగ్ దగ్గర 19.50
వనస్థలిపురం, పనామా గోడౌన్స్ 38.00
చందానగర్, విజేత మార్కెట్ 38.00
మైత్రీవనం 36.50
ఏఎస్ రావు నగర్, ఉషోదయ సూపర్ మార్కెట్ 18.50
మల్లాపూర్, నోమా ఫంక్షన్ హాల్ 22.50
రాజేంద్రనగర్, స్వప్న థియేటర్ 16.50
మేడ్చల్ రోడ్, సుచిత్ర సర్కిల్ 27.00
ఐడీఏ ఉప్పల్, న్యూ మోడ్రన్ బేకరీ ఉప్పల్ 28.00
వనస్థలిపురం, సుష్మా థియేటర్ 36.75
ఓల్డ్ కర్నూల్ రోడ్ టీ జంక్షన్ 37.50

హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థకు సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్ తీరంలోని లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, లేజర్ షో కేంద్రాల ద్వారా సాధారణ రోజుల కంటే గణనీయమైన ఆదాయాన్ని రాబట్టుకుంది. ఇతర రాష్ర్టాల ప్రజలు హుస్సేన్‌సాగర్ అందాలను వీక్షించేందుకుగానూ సంజీయయ్య , లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్‌లకు క్యూ కట్టారు. సాధారణ రోజుల్లో ఈ మూడు పర్యాటక ప్రాంతాలకు రోజుకు 5వేలకు మించని సందర్శకులు ..గడిచిన ఎనిమిది రోజులు పది వేల నుంచి 38వేలకు వేలకు పైగా సందర్శకుల సంఖ్య దాటడం విశేషం. ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కు, లేజర్ షో, సంజీవయ్య పార్కుల ద్వారా హెచ్‌ఎండీఏ ప్రతి నెలా సరాసరి రూ. 70లక్షల మేర ఆదాయం సమకూర్చుకుంటుండగా, గడిచిన ఎనిమిది రోజులుగా రూ.33.38 లక్షల ఆదాయాన్ని రాబట్టుకోవడం గమనార్హం.

(సంజీవయ్య, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, లేజర్‌షోలు కలిపి)
తేదీ సందర్శకులు వచ్చిన ఆదాయం (రూ.ల్లో)
10 12883 2,80,340
11 12336 2,69,245
12 13817 2,99,540
13 19893 4,20,800
14 30351 6,33,875
15 38139 7,46,655
16 21873 4,28,315
17 12425 2,60,070
మొత్తం 161717 33,38,840

321
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...