రిపీటెడ్ ఉల్లంఘనదారులకు జైలు !


Thu,January 18, 2018 04:15 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: నిబంధనలు పాటించని దుకాణదారులపై నగర పోలీసులు దృష్టిపెట్టారు. తరచూ నిబంధనలు ఉల్లంఘించేవారిని సాక్ష్యాధారాలతో ఈపెటీ కేసులతో వారిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. దీంతో వారికి జైలు శిక్షలు పడుతున్నాయి. గతంలో పెటీ కేసు అంటే రూ. 50 నుంచి రూ. 100 వరకు జరిమానాలు చెల్లిస్తూ యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడేవారు. అయితే పోలీసు లు టెక్నాలజీ పరంగా వారిని దారిలోకి తెస్తున్నారు. గత ఏడాది 25,322 ఈపెటీ కేసులు నమోదయ్యాయి. ఒకే వ్యక్తి రిపీటెడ్‌గా అదే ఉల్లంఘనకు పాల్పడితే అతనికి జైలు శిక్ష ఎక్కువ కాలం పడుతున్నది. దీంతో దుకాణదారులు సమయానికి మూసేస్తున్నారు. ఇలా.. ఒక పక్క లా అండ్ అర్డర్, మరో పక్క ట్రాఫిక్ పోలీసులు ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. అలాగే ఫుట్‌పాత్‌లను అక్రమించుకొని వ్యాపారాలు చేసేవారు, రోడ్లకు అడ్డంగా వ్యాపార సామగ్రిలను పెట్టేవారు ఇప్పుడు నిబంధనలు పాటిస్తున్నారు.

ఈ పెటీ కేసులతో పారదర్శకత
విధి నిర్వహణలో ఉండే పోలీసు సిబ్బంది చేతిలో ట్యాబ్ ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించారంటే... వారు ఏ నిబంధన ఉల్లంఘించారనే విషయంపై ట్యాబ్‌తో స్పష్టత వస్తున్నది. దుకాణం రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉందంటే, దానిని ట్యాబ్‌తో ఫొటో తీస్తారు. దుకాణం నిర్వహించే ప్రాంతం గూగుల్ మ్యాప్స్‌తో ఆంక్షాలు, రేఖాంశాలు ఆధారంగా పక్కాగా ఫొటో తీస్తారు. దుకాణం దారు పేరు, అతని వివరాలు ట్యాబ్‌లో నమోదు చేస్తారు. ఇదంతా సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తమయి ఉంటుంది. ఒకసారి ఫొటో తీయగానే దుకాణం నిబంధనల ప్రకారం కాకుండా, సమయానికి మించి నిర్వహిస్తున్న విషయం, ఏ సమయంలో ఫొటోలు తీశారన్న విషయం పక్కాగా తెలిసిపోతున్నది.

దీంతో ఫలాన వ్యక్తి నిబంధనలు ఉల్లంఘించాడనే విషయం పక్కాగా ఆధారాలతో సహా తెలిసిపోతున్నది. ఇక్కడ పోలీసులు ఎవరు కూడా కావాలనే ఉద్దేశ్యంతో కేసులు నమోదు చేసే అవకాశాలుండవు. అంతా పారదర్శకంగా సాగుతున్నది. ఉల్లంఘనదారులు కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. ఉల్లంఘన దారుడిపై అన్‌లైన్‌లోనే వెంటనే పోలీసుల వద్ద ఉండే యాప్ నుంచి చార్జిషీట్ నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తారు. రిపీటెడ్‌గా అదే ఉల్లంఘనకు పాల్పడేవారికి జైలు శిక్షలు ఎక్కువ కాలం కోర్టు విధించేందుకు అవకాశముంటుంది. ఇలా ఒకటి నుంచి ఐదు రోజుల వరకు 2200, ఆరు నుంచి 10 రోజులు 110, 11 నుంచి 16 రోజులు నలుగురికి జైలు శిక్షలు పడ్డాయి.

219
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...