ఖైరతాబాద్‌కు మరో ఆర్‌యూబీ


Wed,January 17, 2018 03:43 AM

ఖైరతాబాద్ : ఖైరతాబాద్‌లో మరో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మించాలని అధికారులు యత్నిస్తున్నారు. రాజ్‌భవన్ రోడ్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ఎదురుగా ఉన్న ఆర్‌యూబీ నిర్మాణం కోసం గత ఏడాది రైల్వే, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పరిశీలించారు. ఆస్కీ ముందు నుంచి రాజ్‌నగర్ మీదుగా నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం రహదారిని ఏర్పాటు చేసి ఆర్‌యూబీని నిర్మించేందుకు నిర్ణయించారు. దీనికి రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే మధ్యలో నాలా ఉండటంతో పాటు రాజ్‌నగర్‌కాలనీ కొంత ఎత్తులో ఉంది. దీంతో ఇక్కడ రహదారి ఏర్పాటు చేయాలంటే కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు హైలెవల్ కమిటీని వేశారు. ఉన్నతాధికారుల బృందం ఇక్కడ ఆర్‌యూబీ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫైల్ పెండింగ్‌లో ఉండగా, జీహెచ్‌ఎంసీ నుంచి క్లియరెన్స్ లభిస్తే ఇక్కడ మార్గం సుగమమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా రాజ్‌భవన్ కూడా సమీపంలో ఉండటంతో కొన్ని సెక్యూరిటీ సంబంధించిన సమస్యలపై కూడా చర్చిస్తున్నట్లు తెలిసింది.

399
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...