అత్తింట్లో అల్లుడి దొంగతనం

Wed,January 17, 2018 03:43 AM

అమీర్‌పేట్ (నమస్తే తెలంగాణ): గత నెల డిసెంబర్ 30వ తేదీ ఆ ఇంట్లో దొంగతనం జరిగింది.. చేసింది సాక్షాత్తు ఇంటి అల్లుడే.. దొంగతనం జరిగిన తీరు... తదుపరి పోలీ స్ విచారణలో అల్లుడి వ్యవహారం అనుమానాస్పదంగా తోచడంతో పోలీసులు తమ దర్యా ప్తును మరింత లోతుగా చేపట్టారు. ఇంటి అల్లుడిపై అనుమానం... తమ విచారణ ఏ మాత్రం గతి తప్పినా.. ఆ కుటుంబ బాంధవ్యాలకు తీరని విఘాతం కలిగే ప్రమాదం ఉంది.. కేసును ఛేదించేందుకు అత్యంత సున్నితమైన పరిస్థితులను సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఎట్టకేలకు ఇంటి అల్లుడే దొంగని తేల్చి.. తమ దైన సమయస్పూర్తితో కేసును ఛేదించిన ఎస్‌ఆర్‌నగర్ పోలీసుల పనితీరుకు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో జరిగిన విలేకర్ల సమా వేశలో పశ్చిమ మండలం డీసీపీ ఎం.వెంకటేశ్వర్‌రావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో
బీకేగూడ తులసినగర్‌కు చెందిన ఆంథోనిరెడ్డి బాలానగర్ లేజర్ బ్లేడ్స్ కర్మాగారంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆంథోని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. యూఎస్‌లో ఉంటున్న చిన్న కుమార్తెను చూసేందుకు వెళ్లిన ఆంథోనిరెడ్డి జనవరి 31వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు నగరాని కి చేరుకోవాల్సి ఉంది. నగరంలోని ముషీరాబాద్ రామ్‌నగర్‌లో నివాసముంటున్న ఆంథోనిరెడ్డి పెద్దల్లుడు హ్యారీ ఆంథోని పాస్కల్ మియాపూర్ క్లబ్‌హౌస్‌లో జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. గత సంవత్సరకాలంగా తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంథోని పాస్కల్‌కు తన అత్త, మామలు యూఎస్‌కు వెళ్లడం.. ఆ ఇంటి, బీరువా తాళాలు తన దగ్గర ఉండడంతో.. ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు దొంగలిస్తే తన సమస్యలు తీరిపోతాయనే ఆలోచనతో దొంగతనానికి పథక రచన చేశారు...

అనుమానం రాకుండా కారం పొడి చల్లి
అత్తింట్లో దొంగతనం చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకున్న హ్యారీ ఆంథోనీ పాస్కల్... అంతా కలిసి యూఎస్ నుండి వస్తున్న ఆంథోని దంపతులకు స్వాగతం పలికే మూడ్‌లో ఉండగా.. తాను నెక్లెస్ రోడ్డు సమీపంలోని ఐ మ్యాక్స్‌లో సెకండ్ షో సినిమాకు వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. సినిమా కొంత సేపు చూసి అక్కడి నుండి బయటకు వచ్చి బీకేగూడ తులసినగర్‌లో అత్తింటికి వెళ్ళాడు.

కేవలం రెండు మూడు గంటలలో ఆంథోని రెడ్డి నగరానికి చేరుకుంటాడనే సమయంలో ఇంటి గేటు తాళం తీసుకుని లోపలికి వెళ్లి.. తలుపు తట్టాడు. ఇంటికి కాపలాగా ఉన్న ఆంథోనిరెడ్డి అత్త ఆంథోనమ్మ (71) వచ్చి తలుపులు తెరవగా ముఖం కనిపించకుండా ముసుగు ధరించిన ఆంథోని పాస్కల్ ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడి వృద్ధురాలు అని కూడా చూడకుండా ముఖంపై.. పక్కటెముకల పై పడి గుద్దులు కురిపంచడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఇక ఆంథోని యథేచ్చగా లోపల బీరువాలో ఉన్న 18 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదును సర్దుకుని ఉడాయించాడు.. పోతూ పోతూ ఎవరికి అనుమానం రా కుండా... పోఒలీస్ జాగిలాలు వస్తే అవి ఆచూకీ కనుగొనకుండా ఉండేలా ఇల్లు మొత్తం కారంపొడి చల్లి పోయాడు. దీంతో మరుసటి రోజు పోలీస్ జాగిలాలు వచ్చినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

ఇంటి అల్లుడి వ్యవహా రం పట్ల ఆంథోనిరెడ్డికి పోలీసులు వివరించగా కుటుంబం షాక్‌కు గురైంది. కేవలం అనుమానాలు మాత్రమే వ్యక్తం చేసిన పోలీసులు మరింత లోతుగా కేసును పరిశోధిస్తే మరింత క్లారిటీ వస్తుందని తేల్చడంతో మొదటిసారి ఆంథోనిరెడ్డి దంపతులకు అనుమానాలు తలెత్తాయి.అయితే కేసు పరిష్కారంలో ఏమాత్రం తప్పులు దొర్లినా ఆ ఇంట్లో పూ డ్చలేనంతగా అగాధం చోటు చేసుకునే ప్రమాదం ఉందిని గ్రహించిన పోలీసులు కేసును చేధించేందుకు ఏ చిన్న అనుమానం తలెత్తినా.. ఆ దిశలో తమ దర్యాప్తును ముందుకు ఉరికించారు. ముందుగా ఐ మ్యాక్స్ నుండి ప్రారంభించిన తమ దర్యాప్తులో దొంగతనానికి పథక రచన చేసిన ఆంథోని పాస్కల్ 11.45 నిమిషాలకు ఐమ్యాక్స్‌లోకి వెళ్లి సినిమా కొంత సేపు చూసి వెంటనే 12.05 నిమిషాలకు బయటకు వచ్చాడు.. ఆ తరువాత తిరిగి 01.45 నిమిషాలకు ముషీరాబాద్‌లోని తన ఇంటి వెళ్ళాడు. 12.05 నుం డి 01.45 నిమిషాల మధ్యనే ఆంథోని పాస్కల్ తాను నిర్ధేశించుకున్న పనిని ముగించాడు.. ఐ మ్యాక్స్ నుండి బీకేగూలోని తన అత్తింటికి చేరుకుని, నగలు దొంగలించి తిరిగి ముషీరాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నంత వరకు దాదా పు ఒక గంట 40 నిమిషాల నిడివి గల సీసీ ఫుటేజీలను సేకరించిన ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు తిరుగులేని సాక్షాధారాలతో ఇంటి అల్లుడే దొంగ అనే నిర్ధారణకు వచ్చారు. ఐ మ్యాక్స్ నుండి మొదలు బీకేగూడ తిరిగి అక్కడి నుండి ముషీరాబాద్ వరకు మొత్తం 18 కి.మీల దూరాన్ని కవర్ చేస్తున్న దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అల్లుడే దొంగ అని నిర్ధారణకు వచ్చిన ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు ఆంథోని పాస్కల్‌ను అరెస్ట్ చేశారు. ఇతని దగ్గర నుండి 18 తులాల బంగారంతో పాటు రూ.1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఏమీ తెలయనట్టుగానే
తన మామ ఆంథోనిరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న ఆంథోని పాస్కల్ ఏమీ తెలియనట్టుగానే వచ్చి అందరితో కలిసి వెళ్లి ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో ఆం థోని పాస్కల్ వ్యవహారం కొంత అనుమానాస్పదంగా తోచడంతో తమ దృష్టిని అతనిపై కేంద్రీకరించి చివరికి ఆట కట్టించారు. ఈ కేసును ఛేదించడంలో ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వాహెదుద్దీన్, డీఐ పి.సతీష్‌ల నేతృత్వంలో డీఎస్‌ఐ జి.శ్రీనివాస్, పీసీలు ఎం. ఈశ్వర్, ఎన్.పూర్ణచందర్‌రావు, ఎన్.కిరణ్‌కుమార్, అశోక్‌లు విశేష కృషి చేశారు. పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర్‌రావు ఎస్‌ఆర్‌నగర్ పోలీసుల కృషిని ప్రశంసించారు.

718

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles