అర్చకుల కుటుంబాల్లో వెలుగులు నింపిన కేసీఆర్


Wed,January 17, 2018 03:42 AM

కాచిగూడ: సీఎం కేసీఆర్ తెలంగాణలోని అర్చకులు, పేద బ్రహ్మణుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి కుటుంబాలలో వెలుగులు నింపాడని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. బర్కత్‌పుర అర్చక భవన్‌లో మంగళవారం గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతటి సాహసాన్నీ చేయ లేదన్నారు. తెలంగాణలో 20 లక్షల పేద బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించడం శుభపరిమాణమని ఆయన పేర్కొన్నారు. దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు. తెలంగాణలో రాజుల కాలం నాటి నుంచి అర్చకుల ఆధీనంలో ఉన్న వేలాది భూములు వారికే చెందే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అర్చకుల ఆధీనంలో ఉన్న ఇనాందారు భూములను లాక్కొ ని దేవాలయాల పేరు మీద చేయడానికి జరుగుతున్న తీవ్ర ప్రయత్నాలను అధికారులు వెంటనే విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేవాదాయ చట్టాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ను కోరు తూ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సందర్భంగా ఇటీవల తమిళనాడు ఎంపీ కనిమొళి సనాతన ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బర్కత్‌పుర చౌరస్తాలో నినాదాలు చేస్తూ ఆమె దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యుడు భద్రకాళి శేషు, గౌరవ అధ్యక్షుడు భాస్కరబాట్ల రామశర్మ, ఎం.రవికుమార్, కారంపూడి నరసింహచార్యులు, గట్టు శ్రీనివాసచార్యులు, మురళీధర్‌రావు దేశ్‌పాండే, కిష్టయ్యతో పాటు పలు జిల్లాలోని అర్చకులు పాల్గొన్నారు.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...