పెద్దల సమక్షంలో ఆత్మీయ వివాహం


Wed,January 17, 2018 03:42 AM

బన్సీలాల్‌పేట్: బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, అనాథాశ్రమంలో 19 ఏళ్ళుగా నివసిస్తున్న మానస అనే యువతికి ఓ పెద్ద కుటుంబం లో ఆత్మీయ వివాహం జరిగింది. ఆదిలాబాద్‌లోని అనాథాశ్రమానికి చెందిన యువతికి, బోయిగూడకు చెందిన యువకుడితో వివాహం జరిగిం ది. పెద్దల సమక్షంలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకా రం ఆ జంట ఒక్కటైంది. ఆదిలాబాద్‌లోని మావ ల గ్రామం, న్యూహౌసింగ్ బోర్డ్ కాలనీలో అలెగ్జాండర్, జయశ్రీ దంపతులు ఆత్మీయ నిలయం పేరుతో అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. వారి వద్ద 19 ఏళ్ళుగా తల్లిదండ్రులు లేని మానస (22) ఆశ్రయం పొందుతోంది. అలెగ్జాండర్, జయశ్రీలనే తన మమ్మీ, డాడీలని ఆందరికీ పరిచయం చేస్తుంది. పెళ్ళీడుకొచ్చిన యువతికి వివా హం చేయాలని ప్రయత్నాలు చేస్తున్న అలెగ్జాండర్ కొద్ది రోజుల క్రితం తన సోదరి అయిన సికింద్రాబాద్‌లోని బోలక్‌పూర్‌లో నివసించే అం గన్‌వాడి టీచర్ విజయరాణిని కలసి మానసకు సంబంధం చూడాలని కోరాడు.

దీంతో విజయరాణి తన అన్నా, వదినలైన మైఖెల్ లోబో, నర్సుబాయి దం పతుల కుమారుడు, బన్సీలాల్‌పేట్‌లో వెల్డింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న డేవిడ్ (25)తో వివాహం చేయాలని నిర్ణయించారు. నర్సుబాయి కి కొడుకులు, కూతుర్లు కలసి 10 మంది సంతానం ఉ న్నారు. వారిది పెద్ద కుటుంబం. ఈ మేరకు ఇద్దరు సమ్మతం తెలపడంతో సోమవారం సంక్రాంతి రోజున బోలక్‌పూర్‌లోని ఎవర్‌గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మత పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిపించా రు. అంగన్‌వాడీ టీచ ర్ విజయరాణి సోదరులు, ఇతర కుటుంబ సభ్యు లు, మిత్రుల సహకారంతో వివాహ ఖర్చులను భ రించి, నూతన వధూవరులకు కావలసిన సామాగ్రిని సమకూర్చారు. అంగన్‌వాడి టీచర్లు, స్థానిక బస్తీ వాసులు పెళ్ళికి హాజరయ్యారు. మానసను పెంచి పెద్ద చేసి, బాధ్యతగా ఆమెకు వివాహం జరిపించిన అలెగ్జాండర్, జయశ్రీలను, ముందుకు వచ్చి అన్ని విధాలుగా సహకారం అందించిన విజయరాణిని అందరూ అభినందించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి, నూతన వధూవరులను అభినందించారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...