ఆకాశమంతా..పతంగుల పండుగ

Mon,January 15, 2018 03:10 AM

-ఆస్వాదించేందుకు పసందైన రుచులు
-స్వీట్ ఫెస్టివల్‌కు విశేష స్పందన
-పరేడ్ గ్రౌండ్స్‌కు తరలివస్తున్న నగరవాసులు

ప్రభుత్వ ఆధ్వర్యంలో పరేడ్ గౌండ్స్‌ల్రో నిర్వ హిస్తున్న కైట్ ఫెస్టివల్ ఆకట్టుకుంటున్నది. ఆదివారం వినూత్న పతంగులు దర్శనమిచ్చాయి. నగరవాసులతో పాటు విదేశీయులు కూడా కైట్ ఫెస్టివల్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

కంటోన్మెంట్/మారేడ్‌పల్లి, నమస్తే తెలంగాణ : రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. దేశ విదేశీయుల ఆకర్షణీయమైన పతంగులు అలరించాయి. పదవే వయ్యారి గాలిపటమా..అంటూ నగరవాసులు తమ కిష్టమైన పతంగులను ఎగురవేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రారంభమైన అంతర్జాతీయ కైట్‌ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతున్నది. అమెరికా,ఉక్రెయిన్, ఇండోనేషియా,బ్యాంకాక్, ఫ్రాన్స్, థాయిలాండ్ తదితర దేశాలకు చెందిన ఔత్సాహికులు గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు.

తింటే స్వీట్సే తినాలె.. చూస్తే గాలిపటాలే చూడాలె.. పోతే పరేడ్ గ్రౌండ్స్‌కే పోవాలని నగరం అంటున్నది. సంక్రాంతి సంబురం, సెలవుల సందర్భంలో కుటుంబాలన్నీ ఇప్పుడు పరేడ్ గ్రౌండ్స్ బాటపట్టాయి. పసందైన రుచుల స్వీట్ ఫెస్టివల్ కిటకిటలాడుతున్నది. హిమాలయాల నుంచి కేరళ వరకు అన్ని రాష్ర్టాల ప్రజలు తమ సంప్రదాయ రుచుల కోసం తరలిరావడంతో పరేడ్ గ్రౌండ్ ఆదివారం సాయంత్రం కళకళలాడింది. మూడో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను తిలకిస్తూ, అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్‌ను ఆస్వాదిస్తూ సంక్రాంతి సంబురాన్ని సంతోషంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ చేపట్టిన ఈ వేడుక ప్రపంచానికి చాటుతూ హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. 25 రాష్ట్రాల సంప్రదాయ తీపి వంటకాలు, 15 దేశాల స్వీట్స్‌ని అందిస్తున్న ఈ ఉత్సవంలో 800 రకాల స్వీట్స్ నోరు తీపి చేస్తున్నది. మొత్తంగా ఎగిరే పతంగుల రెపరెపలు, నోరూరించే స్వీట్స్ ఘుమఘుమలు పరేడ్ గ్రౌండ్స్‌కు పోయిరావాన్న ఆలోచన అందరిలో కలిగిస్తున్నది. కాగా, సోమవారం స్వీట్ ఫెస్టివల్ 1.30 గంటలకే మొదలుకానుంది. - సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

తియ్యని ఇడ్లీలు

నోట్లో వేసుకోగానే తీయగా ఉండే రసగుల్లలాగే ఉంటాయి. కానీ ఇవి ఇడ్లీలు. మహారాష్ట్ర ప్రజలు ఈ తియ్యని ఇండ్లీలను స్నాక్స్‌గా తినేందుకు వీటిని తయారు చేసుకుంటారు. కోవా, బెల్లం, డ్రైఫ్రూట్స్‌ని మైదాతో కలిపిన తర్వాత ఉడికిస్తే ఈ ఇడ్లీలు తయారవుతాయి. గణేశ్ నవరాత్రుల్లో ప్రతి ఇంట్లో ఈ వంటకాన్ని ఆరగించడం అలవాటు.
- శుభాంగి, హైదరాబాద్

గులాబ్ జామ్ నా ఫేవరేట్

ను ఓ స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగిగా ఇక్కడికి వచ్చాను. ఏడాదవుతున్నది. సిటీలో ఎక్కడికి పోయినా గులాబ్ జామ్ తీసుకుంటాను. ఈ ఫెస్టివల్‌లో ఇంకొన్ని స్వీట్స్‌ని ఆరగించాను. ఇక్క డి లడ్డూలు చాలా బాగుంటాయని ఇప్పుడే తెలిసింది.
- డాక్టర్ ఎలెయినర్, ఇంగ్లండ్

పంజాబీ లస్సీ

లస్సీని దేశమంతా ఇష్టపడుతుంది. పం జా బీ లస్సీ టేస్ట్ లోకల్ లస్సీకి వేరుగా ఉంది. సిటీలోనే హైకోర్టుకు సమీపంలో ఈ లస్సీ అమ్ముతున్నాను. హైకోర్టు లా యర్లు చాలామంది వీటికి ఫ్యాన్స్ అయ్యారు.రోజూ 250 నుంచి 300 మంది ఈ లస్సీ కోసం వస్తారు. మూ డు నెలలకు ఒకసారి పంజాబ్ పోయి వస్తాం.
- సేవా సింగ్, చండీఘడ్, పంజాబ్

ఐ లైక్ హల్వా!

హల్వా ఎంత తీయగా ఉందో, తినడం కూడా అంతే హాయిగా ఉంది. కష్టపడకుండా మిం గేయొచ్చు. ఇండియన్ స్టేట్స్ ఎన్నున్నా యో అన్ని రకాల హల్వాలున్నా యని పిస్తుం ది. వేర్వేరు రంగుల్లో ఉండే హల్వా ఏది తిన్నా స్వీట్‌గానే ఉంది. ఐ లైక్ హల్వా!
- ఇసాక్, ఇంగ్లండ్

టేస్టీ అరిసెలు..

తెలుగు వాళ్లు సంక్రాంతికి కొత్త బియ్యం, కొత్త బెల్లం తో అరిసెలు చేసుకుంటారు. ఇక్కడ బియ్యం పిండితో వండుకుంటారు. మా వద్ద మైదా, బెల్లం లేదా పంచదారతో వండుకుంటాం. బెల్లం తో పాకం తీసిన తర్వాత దా నిని మైదాలో కలుపుతాం. ఆ తర్వాత అరిసెల మాదిరే వేడి నూనెలో ఉడికిస్తాం.
- సరితాకౌర్, బిజ్నూర్, పంజాబ్

స్వీట్ మీల్స్ !

స్వీట్ ఫెస్టివల్ చాలా బాగుంది. వందల స్వీట్లు ఒకేచోట ఉంటే నిజంగా మతి పోతుంది. ఇవి తినాలని ఉన్నా పొట్ట పట్టట్లేదు. ఈ రాత్రి భోజనం చేయకుండా ఈ స్వీట్లే తినాలని నిర్ణయించుకున్నా.. మామి డి తాండ్రలు కొన్నాను.
- పితాన్, థాయ్‌లాండ్

స్వీట్ రిలేషన్

ఐదు రకాల స్వీట్స్ ఇష్టంగా తిన్నా ను. ఒకే టేస్ట్ అంటున్నారు. కానీ ఒక్కో స్వీట్ ఒక్కో టేస్ట్‌తో ఉంది. ఇండియన్స్ ఇన్ని రకాల స్వీట్స్ తింటారంటే ఆశ్చర్యపో యాం. ఫెస్టివల్స్‌కు, స్వీట్స్‌కు ఉన్న రిలేషన్స్ చెబుతుంటే ఆశ్చర్యం వేసింది.
- కనోక్స్‌లెకా, థాయ్‌లాండ్

బనానా స్నాక్స్

కేరళ కొబ్బరి రుచులకే కాదు అరిటి రుచులకూ ప్రసిద్ధే. సాధారణ రోజుల్లో స్నాక్స్ కావాలనుకుంటే కేరళ మహిళలు అరటి బజ్జీలు, అరటి చిప్స్ తయారు చేస్తారు. బియ్యపు పండిలో బెల్లం కలిపి, తగినన్ని నీళ్లు కలిపుతారు. అరటిపండును ఆ పిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేయిస్తారు. ఆలూ చిప్స్ తయారు చేసిసట్లే అరటి పండ్లతో చిప్స్‌ను కూడా ఈ పిండిలో ముంచి, వేయించి తయారు చేసుకుంటాం. కేరళ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే స్నాక్స్ ఇవి.
- లిప్సీ అలెక్స్, పత్తనం తిట్ట, కేరళ

స్వీట్ ఫ్రూట్స్

సంక్రాంతి పర్వదినాన తెలుగింటిలో అరిసెలు వండుకున్నట్లే గుజరాతీలు తియ్యని ఫలాలను తిన్న అనుభూతినిచ్చే ఖర్జూర లడ్డూలు తిం టారు. ఖర్జూరతో పాటు డ్రైఫూట్స్‌ని కొబ్బరిపొడితో కలిపి ఈ లడ్డూలను తయా రు చేస్తాం. సంక్రాంతి సందర్భంలో ప్రతి ఇంటిలో ఈ ఖర్జూర లడ్డూలుంటాయి.
- అలీషా, రాజోల, గుజరాత్

బెంగాల్‌లో సంక్రాంతికి...

బెంగాల్‌లో సంక్రాంతి కాలానికి పండిన వరి, చెరకు పంటల నుంచి వచ్చిన బియ్యం బెల్లంతో దూద్ పులిపీత్ తయారు చేస్తాం. బియ్యపు పిండికి కోవా, బెల్లం, కొబ్బరి పొడి కలుపుతాం. ఇది పేస్టులా తయారవుతుంది. వీటిని పక్కన పెట్టి గోధుమపిండితో పూరీలు చేసినట్లుగా చేసి, దాంట్లో ఈ పేస్టుని చుట్టి వేడి నూనెలో వేయిస్తాం. ఇలా దూద్ పులిపీత్ తయారవుతుంది.
- నీలం మోహ్రిత్, పశ్చిమ బెంగాల్

స్వీట్ సిటీ

మన హైదరాబాద్ ఎట్లయితే చెరువుల నగరంగా పేరు తెచ్చుకుందో? ముత్యాల నగరంగా గుర్తింపుపొందిందో, గాజలు నగరంగా ఎలా కీర్తికెక్కిందో అలాగే స్వీట్స్ సిటీగా పేరుపొందుతుంది. ఇది తొలి అడుగు. ఈ విజయం వెనుక అనేక రాష్ర్టాల మహిళలున్నారు. వారందిరినీ ఇక్కడికి తీసుకురావడంలో తోడ్పడిన ఆయా రాష్ట్రాల సమాజాలున్నాయి. ఇది సమష్టి విజయం. విభిన్న భాషా సంస్కృతుల నగరంలో వందల రకాల స్వీట్స్‌తో ఉత్సవం జరుపుకోవడం గొప్ప అవకాశం.
- మామిడి హరికృష్ణ, సాంస్కృతిక శాఖ సంచాలకులు

గుజరాతీ అటుకులు

హైదరాబాద్‌లో అటుకులకు పులుపును గానీ, గరం మసాలాను గానీ జోడించి తిన్నట్లే మావాళ్లు తీపిని జోడించి తిం టారు. కొబ్బరిపొడి, చుడువా, రోజ్‌వాట ర్, డ్రైఫూట్స్‌ని అటుకల్లో కలుపుకొని తిన డం మాకు అలవా టు. ఇవి చాలా తీయ గా ఉంటాయి.
- నసీం ఆఘాఖాన్, మూవ్ నగర్

ఇంట్లో కంటే బెటర్

ఇంట్లో చేసిన పిండి వంటలకంటే ఇక్కడ చేసిన పిండి వంటలే బాగున్నాయి. అమ్మకు తెలంగాణ వంటకాలు చేయడం రాదు. అమ్మమ్మ, నాయనమ్మ ఇంటికి పోయినప్పుడే తెలంగాణ వం టలు రుచిచూస్తాం. లేకపోతే చుట్టాలింటికి పోయినప్పుడు. ఫెస్టివల్ సందర్భంలో కావాలనుకుంటే స్వీట్ షాపు ల్లో కొనుక్కుంటాం. తెలంగాణ ప్రభు త్వం ఇలా ఫెస్టివల్స్ సందర్భంలో ప్రతి ఏటా స్వీట్ ఫెస్టివల్ నిర్వహించాలి.
- ప్రణతి

871

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles