యువత వివేకానందుడి బాటలో నడవాలి


Sat,January 13, 2018 03:29 AM

కుత్బుల్లాపూర్, జనవరి 12 : వివేకానందుడి బాటలో నేటి యువత నడుస్తూ దేశ భవితవ్యానికి పాటు పడాలని ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్‌లో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్ అధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద 155వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్ హైదరాబాద్, జీడిమెట్ల సౌజన్యంతో నిరుపేదలకు ఉచిత కంటి వైద్య శిబిరం, వివేకానంద యూత్ ఆధ్వర్యంలో రక్తందాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి హాజరై ప్రారంభించారు. యూత్ విజ్ఞాన వంతమైతె దేశ ఆర్థిక భవితవ్యం మెరుగు పడుతుందని అన్నారు. అనంతరం మల్కాజిగిరి ఎంపీ సీజీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి ఉపేందర్‌రెడ్డి, స్థానిక సీనియర్ నాయకులు జల్దా రాఘవులు, సాయిగౌడ్, నవీన్, సాయి, శ్రీనివాస్, బీజేపీ నాయకులు నందనం దివాకర్, బాలు నేత, విజయ్, సత్యనారాయణ, ఎల్లయ్య, ఆదర్శనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, సుమిత్రనగర్ సంక్షేమ సంఘం, వార్డు కమిటీ సభ్యులు హన్మిరెడ్డి, ఎండీ అబ్దుల్ ఖాదర్, ఎండీ రహీం, లార్డ్ వేల్ఫేర్ అసోసియేషన్ వైస్ చైర్మన్ కోటిగడ్డ సాయి కృష్ణ, ఎంఐఎం మతిన్ తదితరులు పాల్గొన్నారు.

386
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...