ప్రభుత్వ వైద్యుల సంఘానికి జీఏడీ గుర్తింపు


Sat,January 13, 2018 03:28 AM

సుల్తాన్‌బజార్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌డబ్లూ) డిపార్ట్‌మెంట్ నుంచి తమ కు గుర్తింపు లభించిందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సం ఘం (టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కోఠిలోని వైద్య భవన్‌లో టీజీజీడీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నరహరి, కోశాధికారి డాక్టర్ లాలూప్రసాద్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. 2014 వరకు ఒకటే సంఘంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘంలో చీలికలు రావడంతో రెండు వర్గాలుగా విడిపోయి రెండు యూనియన్లు ఒకటే పేరుతో నడుస్తున్నాయన్నారు. అయితే అప్పట్లో కొంతమంది యూనియన్ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడు తుం డడంతో వారిని బహిష్కరించినట్లు తెలిపారు. ఇలా విడిపోయిన వారు మరో సంఘం ఏర్పాటు చేయడంతో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తమను గుర్తించమని జీఏడీ విభాగానికి ఆదేశాలు జారీ చేయడంతో ఇటీవల తమను జీఏడీ గుర్తించిందని, తమదే అసలైన సంఘమని తెలిపారు.

236
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...