ఆన్‌లైన్‌లో అనుమతులు గ్రాండ్ సక్సెస్


Thu,December 7, 2017 02:27 AM

-22,246 దరఖాస్తుల్లో 18,616 నిర్మాణాలకు అనుమతులు జారీ
-మూడు నెలల్లో అనూహ్య స్పందన
-జీహెచ్‌ఎంసీకి 739 కోట్ల ఆదాయం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు అందించేందుకు డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) పారదర్శకతను, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు బల్దియా ప్రారంభించిన ఆన్‌లైన్‌లో ఇంటి అనుమతుల ప్రక్రియ విజయవంతమైంది. మొత్తం 22,246 దరఖాస్తులు రాగా 18,616 భవనాలకు అనుమతులు జారీ చేశారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లో పర్మిషన్ ఇచ్చి బల్దియా తన ప్రత్యేకతను చాటుకున్నది. కొత్తగా ప్రారంభించిన డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) విధానంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు రూ.739కోట్ల ఆదాయం వచ్చింది. నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నందుకు జీహెచ్‌ఎంసీకి 2017 స్కోచ్ మెరిట్ అవార్డు ప్రకటించింది. 20,21 తేదీలలో న్యూఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారం అందుకోనున్నారు.

విధానం వల్ల 18,616 అనుమతులను మంజూరు చేశారు. మొత్తం 22,246 దరఖాస్తులు వస్తే నిబంధనల ప్రకారం ఉన్న 80 శాతం దరఖాస్తులు 18,616 భవనలకు నిర్మాణ అనుమతులు జారీ చేశారు. ఈ అనుమతి కేవలం 30 రోజుల్లోనే జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ నూతనంగా ప్రవేశపెట్టిన డీపీఎంఎస్ విధానంతో 2016-17 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు పరిష్కారించిన దరఖాస్తుల ద్వారా రూ.739కోట్ల ఆదాయాన్ని సమాకూర్చుకుంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అనుమతిని తగ్గించడంతో పాటు పారదర్శకంగా అనుమతులు జారీ చేసేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా 2016 జూన్ 2న జీహెచ్‌ఎంసీలో డీపీఎంఎస్ విధానాన్ని ప్రారంభించారు. కేవలం భవన నిర్మాణ అనుమతులను జారీ చేయడంతో పాటు కమర్షియల్ భవనాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతులు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లను కూడా డీపీఎంఎస్ విధానం ద్వారానే అనుమతులు ఇవ్వనున్నారు.

దేశంలోని ఇతర నగరాల్లో ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల విధానం అమలుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టగా జీహెచ్‌ఎంసీలో మాత్రం కేవలం మూడు నెలల్లోనే పూర్తిస్థాయిలో అమలు చేశారు. పుణె కార్పొరేషన్‌లో భవన నిర్మాణ అనుమతులను ఆన్‌లైన్‌తో పాటు మ్యాన్‌వల్ నిబంధనలోనూ జారీ చేస్తుండగా జీహెచ్‌ఎంసీలో మాత్రం 100శాతం ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ సంతకంతో కూడిన అనుమతులు జారీ చేస్తున్నారు. ఆన్‌లైన్ విధానం వల్ల టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో జవాబుదారితనంతో పాటు పారదర్శకత ఏర్పడింది. భవన నిర్మాణ అనుమతులు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ల జారీని ఆన్‌లైన్ ద్వారా అందజేయడం ద్వారా జవాబుదారితనం పారదర్శతను సాధించినందుకు జీహెచ్‌ఎంసీకి 2017 స్కొచ్ మెరిట్ అవార్డులను ప్రకటించింది. డిసెంబర్ 20, 21వ తేదీల్లో న్యూఢిల్లీలో 50వ స్కోచ్ సమ్మిట్‌లో ఈ పురష్కారం అందజేయనున్నారు.

490
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...