నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ


Thu,December 7, 2017 02:26 AM

-12 కోర్సుల్లో శిక్షణకు ఏర్పాట్లు
-త్వరలో శిక్షణ నిచ్చేందుకు కసరత్తు
-సమీక్ష నిర్వహించిన కలెక్టర్ యోగితారాణా
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉపాధి లేమితో తల్లిదండ్రుల భారంగా మారిన మైనార్టీ యువతను సన్మార్గంలో నడిపేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న యువతకు నైపుణ్యశిక్షణనిచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. యువతలో గల అంతర్గత శక్తియుక్తులను సద్వినియోగం చేసుకుని తమకాళ్లపై తాము నిలబడేలా తయారుచేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు శిక్షణనివ్వబోతున్నారు. ఇలా మొత్తం 12 కోర్సుల్లో శిక్షణనిచ్చి.. నిరుద్యోగులకు ఉపాధి మార్గం చూపించబోతున్నారు. త్వరలోనే ఈ శిక్షణా కార్యక్రమం జిల్లాలో ప్రారంభంకాబోతోంది. జిల్లా జనాభా మొత్తంలో మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. మొత్తం జనాభాలో 46. 54 శాతం మైనార్టీలే ఉండగా, దీంట్లో 93.41 శాతం ముస్లిం వర్గానికి చెందిన వారే ఉన్నారు. దీంట్లో 60 శాతం యువకులే ఉండటం గమనార్హం. వీరిలో చాలా మంది చదుకుని కొంత మంది నిరక్షరాస్యులుగా కొంత మంది ఎలాంటి ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారు. వీరందరికి నైపుణ్యశిక్షణనిచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర పథకాలను ఉపయోగించుకోబోతున్నారు.

అర్హతలు..ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగ మైనార్టీ యువత
శిక్షణనిచ్చే కోర్సులివే..ఎలక్ట్రిషియన్, మ్బైల్ ఫోన్‌రిపేరింగ్, సీసీటీవీ సర్వీసెస్, బ్యూటీషీయన్, వెబ్‌డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, మెడికల్ డీ కోడింగ్, బెడ్‌సైడ్ నర్సింగ్, ఫార్మసీ అ సిస్టెంట్, విజన్ టెక్నిషియన్, డీజిల్ మెకానిక్, ఆటోబాడీ రిపేర్ అండ్ పేయింటింగ్ వంటి కోర్సుల్లో శిక్షణనివ్వబోతున్నారు. మైనార్టీ యువతకిచ్చే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం కార్యాచరణపై జిల్లా కలెక్టర్ డా. యోగితారాణా బుధవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్లో ఎస్టేట్ ఆఫీసర్ నిఖిల, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ భాస్కరాచారి, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ, సెట్విన్, ఈసీఐఎల్ యాజమాన్యాలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యత గురించి అధికారులకు వివరించిన ఆమె.. జిల్లా లో పటిష్టంగా అమలుచేయాలని సూచించారు. ఇందుకోసం ఎంపికచేసిన ఏజెన్సీలకు, మెప్మా సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఖాసీం, అసిస్టెంట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అహల్య, సెట్విన్ సంస్థ ప్రతినిది నరోత్తం, బీఎన్‌చారి, ఈసీఐఎల్ ప్రతినిది ఎస్‌వీ సావిత్రి సహా ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

440
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...