అగ్గువకు బంగారమంటూ...దోచుకున్నారు


Thu,December 7, 2017 02:24 AM

-ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
-అరెస్టయిన వారిలో సినిమా నిర్మాత
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఓ సిని మా నిర్మాతను, అతడికి సహకరిస్తున్న వ్యక్తిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాథాకిషన్‌రావు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన రెడ్డిమల్ల ఉదయ్‌కుమార్ 7వ తరగతి వరకు చదివాడు. 2008లో నగరానికి వచ్చి సుచిత్ర ప్రాంతంలో రెడీమెడ్ క్లాత్‌స్టోర్‌ను నిర్వహించి, నష్టాలు రావడంతో 2012లో మూసేశాడు. 2013లో అతని స్నేహితుడితో కలిసి యూకే ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తూ తనకు తానుగా ఓ మనసా ఎవరి కోసం అనే సినిమాకు నిర్మాతగా ఉన్నానంటూ చెప్పుకుంటున్నాడు. కాగా.. వరంగల్ జిల్లాకు చెందిన టి.రవికుమార్ ఎంసీఏ పూర్తి చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో సంవత్సరం క్రితం ఉదయ్‌కుమార్‌తో పరిచయం అయ్యింది.

సొంత డబ్బును జత చేసి కొంటాడు...!
ఉదయ్‌కుమార్ తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ మోసాలు చేస్తున్నాడు. నమ్మకం కుదిరేందుకు ఒకటి రెండు తులాలు ఇచ్చి వారిని నమ్మించేవాడు. మార్కెట్లో రూ. 30 వేల తులం బంగారం ఉంటే రూ. 26 వేలకు ఇప్పిస్తానమంటూ నమ్మిస్తాడు. ఎవరైన అతన్ని సంప్రదిస్తే రూ. 26 వేలతోనే దుకాణంలోకి వెళ్లి, తన డబ్బులను అందులో కలిపి బంగారం తీసుకొని ఇచ్చేస్తాడు. ఇలా మోసాలు చేస్తుండడంతో 2014లో మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఇదిలాఉండగా.. సంవత్సరం క్రితం పరిచయం అయిన రవికుమార్‌కు ఈ విషయం చెప్పాడు. కస్టమర్లను తీసుకొస్తే కొంత కమీషన్ ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో వృత్తిరీత్యా గోల్డ్‌స్మిత్ అయిన మహేష్ వీళ్లను గత నెల చివర్లో సంప్రదించాడు. ముందు గా 5 తులాల బంగారం కావాలంటూ కోరడంతో రూ. 26 వేలకు తులం చొప్పున, ఉదయ్ తన వద్ద ఉన్న డబ్బులను జత చేసి బంగారం కొని ఇచ్చాడు. దీంతో మహేష్‌కు నమ్మకం వచ్చింది.

రెండు రోజుల తరువాత బంగారం బిస్కెట్ ఉందంటూ మహేష్‌కు ఫోన్ చేసి చెప్పా రు. దీంతో మహేష్ తక్కువ ధరకు వస్తుందని, రూ.7.80 లక్షలు చెల్లించాడు. సికింద్రాబాద్ ప్రాంతంలోని పన్నా జ్యువెలరీ షాప్‌లో కొని ఇస్తానంటూ నమ్మించి, లోపలికి వెళ్లి మహేష్ దృష్టి మళ్లించి తప్పించుకొని పోయాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మహేష్ మార్కె ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా .. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు బృందం కూడా ఈ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో ఉ దయ్‌కుమార్, రవికుమార్‌లను పట్టుకొని వారి వద్ద నుంచి రూ. 5 వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం మార్కెట్ పోలీసులకు అప్పగించారు.

326
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...