మేడ్చల్ జిల్లాలో పూర్తైన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే


Tue,November 14, 2017 12:57 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో నిర్వహించిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (ఎన్‌ఏఎస్) పరీక్ష ముగిసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు ఏ మేరకు నైపుణ్యతను సాధిస్తున్నారో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రాష్ర్టాల్లో నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే సోమవారం జిల్లాలోని సుమారు 151 ప్రభుత్వ స్కూల్స్‌లోని 3, 5, 8వ తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో 882 మంది 3వ తగరతి విద్యార్థులకు, 1223 మంది 5వ తగరతి విద్యార్థులకు, 1361 మంది 8వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సర్వేలో జిల్లాకు చెందిన వివిధ శాఖల జిల్లా అధికారులు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 151 సెంటర్స్‌ను ఏర్పాటు చేసి, 320 మంది పర్యవేక్షకులను నియమించామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

మార్పు కోసమే : డీఆర్‌డీఓ పీడీ కౌఠిల్యారెడ్డి
మేడ్చల్, నమస్తే తెలంగాణ/శామీర్‌పేట : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు గాను బోధన విధానంలో చేపట్టవలసిన మార్పుల కోసం భారత ప్రభుత్వం నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే నిర్వహిస్తుందని డీఆర్‌డీఓ పీడీ కౌఠిల్యారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని మేడ్చల్, రాజబొల్లారం, గౌడవెళ్లి, డబిల్‌పూర్, గుండ్లపోచంపల్లి, రావల్‌కోల్, రావల్‌కోల్ తండా, ఎల్లంపేట, కండ్లకోయ గ్రామాల్లో శామీర్‌పేట మండలంలోని ఉద్దెమర్రి, ఆద్రాస్‌పల్లి, దేవరయాంజాల్, కొల్తూర్ గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు సోమవారం జాతీయ విద్యా శిక్షణ పరిశోధన సంస్థ(ఎన్‌సీజీఆర్‌సీ) ఆధ్వర్యంలో నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే పరీక్ష 2017 నిర్వహించారు. ఎంఈవో వసంతకుమారి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జయశీల, ఏవో రమేష్, రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.

339
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...