మేడికుంటపై కదిలిన యంత్రాంగం


Tue,November 14, 2017 12:56 AM

చందానగర్, (నమస్తే తెలంగాణ): మేడికుంటపై అధికార యం త్రాంగం కదిలింది. నమస్తే తెలంగాణ దిన ప్రతికలో మేడి కుంట మాయం శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనానికి సీఎం కార్యాలయం స్పందించి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను చర్యలకు ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమం లోనే మేడికుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టి డంపింగ్‌పై జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు నివేదిక సమర్పించనున్నట్టు ఇరి గేషన్ ఎస్‌ఈ వై.శేఖర్‌రెడ్డి నమస్తే తెలంగాణకు వివరించారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి మంగళవారం జా యింట్ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మేడికుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో బండరాళ్లు, మట్టి నింపిన వాళ్లను గుర్తించి వారిపై క్రి మినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పోసిన మట్టి, బం డరాళ్లను వారితోనే తీయించేలా వత్తిడి తెస్తామని, మేడికుంటకు పూర్వవైభవం తీసుకువస్తామని అన్నారు.

మేడికుంట నిఘాకు ఇద్దరు వీఆర్‌ఏలు...
మేడికుంట కబ్జాపై శేరిలింగంపల్లి తహసీల్దార్ ఎస్.తిరుపతిరావు విచారణకు ఆదేశించారు. బాధ్యులను గుర్తించి పోలీసు కేసులు నమోదు చేయాలంటు గిరిదావర్ నిహంత్‌ను ఆదేశించినట్టు తహసీల్దార్ తెలిపారు. స్థానిక వీఆర్‌వోలతో కలిసి మేడికుంటను సందర్శించిన గిరిదావర్ నిహంత్ కుంట స్థలంలో మట్టినింపింది వాస్తవమేనని, అయితే ఎవరు నింపారన్నది తెలియాల్సి ఉందని ప్రాథమిక నివేదికను తహసీల్దార్‌కు అందజేశారు. మెడికుంట వద్ద నిఘాకోసం వీఆర్‌ఏలు జమీర్, సురేష్‌లను నియమిం చా మని, ఇకపై కుంటలో ఎలాంటి పూడ్చివేతలు జరుగకుండా చూ సుకుంటామని ఆర్‌ఐ నిహంత్ తెలిపారు. ఇప్ప టికే మట్టి బండరాళ్లు నింపిన బాధ్యులను వెంటనే గుర్తించి వారిపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.

295
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...