ఘనంగా శంకుస్థాపన


Fri,October 13, 2017 12:56 AM

-అందిరికీ అందుబాటులో కలెక్టరేట్‌లు : మంత్రి పద్మారావు
-మూడు జిల్లాలకు రూ.130 కోట్లతో కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు
-ఏడాది కాలంలో పనులు పూర్తి: మంత్రి మహేందర్‌రెడ్డి
ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో రూ.35కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డి, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావు.

చిన్న జిల్లాల ఏర్పాటుతోనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్, యువజన, క్రీడల శాఖ మంత్రి పద్మారావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని టీఎస్‌ఐఐసీ భూముల్లోని 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.35కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి రాష్ట్ర ఎక్సైజ్, యువజన, క్రీడల శాఖ మంత్రి పద్మారావు, రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగలకృష్ణారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావులు భూమి పూజ చేసి, అనంతరం కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ప్రజలు ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారని అన్నారు. అందుకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా కలక్టరేట్‌ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.

అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.130 కోట్లతో కలెక్టరేట్ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తున్నదన్నారు. కలెక్టరేట్‌ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కొంగరకలాన్‌లో కలెక్టరేట్ ఏర్పాటుకు ప్రత్యేక శ్రదకధ తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, వంశీచందర్‌రెడ్డి,ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రమేష్‌బాబు, ఈఈ మోహన్‌రావు,డీపీఓ పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి. మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, వంగేటి లకా్ష్మరెడ్డి, ఎంపీపీలు మర్రి నిరంజన్‌రెడ్డి, జ్యోతినాయక్, హరిత, జయమ్మ, జట్పీటీసీ రమేష్‌గౌడ్, వైస్ ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్, కొంగరకలాన్ సర్పంచ్ బంగారిగల్లా శేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు వై నిరంజన్‌రెడ్డి. నాయకులు జేపీ శ్రీనివాస్‌రావు,బర్ల జగదీష్ యాదవ్, కల్వకోలు రవీందర్‌రెడ్డి, బూడిదనందారెడ్డి, బూడిద నర్సింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభలు తదితరులు పాల్గొన్నారు.

352
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...