వెల్లి విరిసిన హరిత స్ఫూర్తి సందడిగా గ్రీన్‌డే..


Fri,October 13, 2017 12:55 AM

సిటీబ్యూరో: గ్రీన్ డే సందర్భంగా గురువారం లక్ష మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని అధికారులు సాధించారు.మొక్కలు నాటి, పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు పచ్చదనం ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలతో పాటు విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గ్రీన్ డే సందర్భంగా లక్ష మొక్కలను నాటాలన్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సీతాఫల్‌మండి డివిజన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ పార్క్‌లో మంత్రి పద్మారావు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, సికింద్రాబాద్ నియోజకవర్గ కార్పొరేటర్లు హేమ, సరస్వతి, ధనంజన, విజయకుమారితో కలిసి మొక్కలు నాటారు. మేయర్ బొంతు రామ్మోహన్ కాప్రాలోని నాగార్జుననగర్, చక్రీపురం క్రాస్‌రోడ్‌లో, కూకట్‌పల్లిలోని పవర్‌నగర్ పార్కులో ఎమ్మెల్యే కృష్ణారావుతో కలిసి మొక్కలు నాటారు. కృష్ణకాంత్‌పార్కు, యూసుఫ్‌గూడలో డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్ మొక్కలు నాటారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు కేబీఆర్ పార్కులో మొక్కలు నాటగా, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఈర్లచెరువు, రైల్ విహార్‌లో, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ యూసుఫ్‌గూడ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో, పటాన్‌చెరూ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కాకతీయనగర్ కాలనీలో, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ స్థానిక అరోరా కాలేజీలో మొక్కలు నాటారు. ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ కుత్బుల్లాపూర్, పెద్దఅంబర్‌పేట్ మొక్కలు నాటడంతో పాటు పంపిణీ చేశారు.వాటిని సంరక్షిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

సీతాఫల్‌మండి:హరితహారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పద్మారావు పిలుపునిచ్చారు.నాటిన మొక్కలను ప్రజలు సంరక్షించాలని సూచించారు.సీతాఫల్‌మండి డివిజన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ పార్కులో మంత్రి పద్మారావు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, సికింద్రాబాద్ నియోజకవర్గ కార్పొరేటర్లు హేమ, సరస్వతి, ధనంజన, విజయకుమారితో కలిసి మొక్కలు నాటారు.

-కేపీహెచ్‌బీకాలనీ, చర్లపల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్ పవర్ నగర్‌లో మేయర్ బొంతు రామ్మోహన్, కూకట్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్ కమిషనర్ హరిచందన, డీసీ దశరథ్, స్థానిక కార్పొరేటర్ పన్నాల కావ్యాహరీశ్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కాలనీ ప్రజలకు, విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం హరిత తెలంగాణ నిర్మాణం కోసం ఏటా కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అలాగే చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం ప్రధాన రహదారిలో మేయర్
మొక్కలు నాటారు.


-వెంగళరావునగర్ : వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని కృష్ణకాంత్ పార్కులో మొక్కలు నాటుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్,
కార్పొరేటర్ కిలారి మనోహర్ తదితరులు .


సిటీబ్యూరో:ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో మొక్కలు నాటుతున్న జేటీసీ పాండురంగనాయక్, ఆర్‌టీవో రమేష్, ఏవోలు పురుషోత్తంరెడ్డి, అంజుం, పద్మావతి,రామ్‌కుమార్, టీఎన్జీవో నగర అధ్యక్షుడు శామ్యూల్‌పాల్ తదితరులు పాల్గొన్నారు.

సిటీబ్యూరో:హెచ్‌ఎండీఏ అర్బన్‌ఫారెస్ట్రీ విభాగం డైరెక్టర్ శ్రీనివాస్, ఏడీ సత్యనారాయణ, ఫారెస్ట్ మేనేజర్లు మోహన్, జ్ఞానేశ్వర్, దేవుజా ఆధ్వర్యంలో శంషాబాద్, శామీర్‌పేట, కొల్లూరు ప్రాంతాల్లో స్థానిక పాఠశాలల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పట్టణ గ్రీనరీపై పాఠశాలల విద్యార్థులకు డైరెక్టర్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. అనంతరం శామీర్‌పేట, శంషాబాద్, కొల్లూరులో 20వేల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసినట్లు డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పారు. ఔటర్ మార్గంలో మరింత గ్రీనరీని పెంచి ఆహ్లాదకరంగా మారుస్తామన్నారు.

-పెద్దఅంబర్‌పేట: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుని బంగారు తెలంగాణ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరముందని సీడీఎంఏ అధికారిని డాక్టర్ శ్రీదేవి, ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. నగర పంచాయతీ పరిధిలోని కుంట్లూర్‌లో నగర పంచాయతీ, వివేకానంద సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. రాష్ట్రంలోని 73 మున్సిపాల్టీల్లో మొక్కలు నాటుతున్నామన్నారు. అనంతరం హరితహారం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఈదమ్మల ధనలక్ష్మి బలరాం, కమిషనర్ సత్యబాబు, కౌన్సిలర్లు జోర్క జగన్ ముదిరాజ్, చామ సంపూర్ణారెడ్డి, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

218
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...