ఎన్నాళ్లకెన్నాళ్లకు..


Thu,October 12, 2017 12:10 AM

- చెరువులకు జలకళ.. అలుగుపోస్తున్న 119చెరువులు
- నగరంలో 18 రోజుల్లో గరిష్టంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం
- చెరువుల దత్తతకు జీహెచ్‌ఎంసీ విధి విధానాలు
- బెంగళూరు తరహా విధానం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌లోని చెరువులు కళకళలాడుతున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అలుగుపోస్తుండడంతో స్థానికులు సంబురాలు చేసు కుంటున్నారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల వల్ల ఏ చెరువుకూ నష్టం జరగలేదు. చెరువుల పూర్తి నీటిమట్టం స్థాయిలను (ఎఫ్‌టిఎల్) నిర్ధారించే ప్రక్రియను చేపట్టిన జీహెచ్‌ఎంసీ బెంగళూరు తరహా విధానాన్ని ఉపయోగించి గుర్రపుడెక్క సమస్యను పరిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నది.

ఇటీవల కురు స్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ పరిధిలోని చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మొత్తం 185 చెరువులకు గాను పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగు వప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో 119 చెరువులు అలుగుపోస్తున్నాయి. మిగిలిన చెరు వులు సైతం నీటితో నిండుకుండలా మారాయి. మరోవైపు, అధికారులు సీఎస్‌ఆర్ కింద చెరువు లను శుద్ధిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో గత ఆగస్టు 17వ తేదీ నుంచి అక్టోబర్ 10 వరకు 18 రోజుల్లో నగరంలో గరిష్టంగా 21సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చెరువుల్లో భారీ పరిమాణంలో నీరు చేరిం ది. దీనికితోడు ఇటీవల క్రమం తప్పకుండా కురు స్తున్న వర్షాలకు అవి పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా చెరువులు చాలావరకు ఆక్రమణలకు గురికా వడం, పూడిక పేరుకుపోవడంతో వాటి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.

అయినప్పటికీ వరద తాకిడికి కట్టలు తెగకుండా జీహెచ్‌ఎంసీ అధికా రులు చాకచక్యంగా వ్యవహారించి వరదనీటిని ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాలకు వదలడంతో కృతకృత్యులయ్యారు. అయినా సర్‌ప్లస్ నీటి ప్రవాహంతో దిగువ ప్రాంతాలు, ఆయా చెరువుల పరీవాహక ప్రాంతాలు, చెరువు శిఖం భూములు, నాలాల వెంట నిర్మించిన కాలనీల్లోకి నీళ్లు చేరా యి. ప్రధానంగా మీరాలంట్యాంక్, ఆర్కేపురం, సఫిల్‌గూడ, బండచెరువు, ఫాక్స్‌సాగర్, దుర్గం చెరువు, రామంతాపూర్ పెద్ద చెరువు ఆక్రమణ లకు గురికావడంతో పాటు నాలాను మూయ డంతో ఆయా గృహాల్లో చేరిన నీటిని తొలగించ డానికి నాలుగురోజులుగా 125హెచ్‌పీ సామర్థ్యం గల మోటర్లతో నీటిని బయటకు తోడుతున్నారు. సఫిల్‌గూడలోని ఆర్కేపురం చెరువు మత్తడి నీరు బండచెరువులో చేరడానికి ఉన్న నాలాలు ఆక్రమ ణలతో కుంచించుకుపోయి లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మొత్తం 33 అడుగుల పూర్తి నీటి సామర్థ్యం గల ఫాక్స్ సాగర్ చెరువులో 28 అడుగుల మేరకు నీరు చేరుకోవడంతో హెచ్ ఎండీఏ పరిధిలో ఉన్న హరిచంద్రకాలనీ ముంపు నకు గురైంది. ఈ విధంగా భారీ వర్షాలు నగరం లోని చెరువులన్నీ నిండినప్పటికీ జీహెచ్‌ఎంసీ చేప ట్టిన ముందు జాగ్రత్త చర్యల వల్ల ఏ చెరువుకు నష్టం జరగలేదు.

చెరువుల శుద్ధికి చర్యలు
గ్రేటర్‌లోని చెరువుల పూర్తి నీటిమట్టం స్థాయిని (ఎఫ్‌టీఎల్) నిర్ధారించే ప్రక్రియను జీహెచ్ ఎంసీ చేపట్టింది. మొత్తం 185 చెరువు లకుగాను 85 చెరువుల్లో గుర్రపుడెక్క వ్యాపించి ఉన్నట్లు గుర్తిం చిన అధికారులు దాన్ని తొలగించాలని సంకల్పిం చారు. మొత్తం కలిపి 1887 ఎకరాల విస్తీ ర్ణంలో ఉన్న గుర్రపుడెక్కను తొలగించేందుకు 18.45 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించే సామర్థ్యం జీహెచ్‌ఎంసీకి లేకపోవడంతో కార్పొరేట్ సొషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్)కింద ఆయా సంస్థలు ఇచ్చే సహాయంతో శుద్ధి పనులను చేపట్టారు. అంతేకాదు చెరువుల శుద్ధికి అవసరమైన నిధులు మంజూరుచేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు ప్రతిపాదనలు సమర్పించారు. ఇప్పటికే నిధులిచ్చేందుకు కొన్ని సంస్థలు ముం దుకు రావడంతో చెరువుల పరిరక్షణ కమిటీలు ఏర్పా టుచేసి వాటిలో స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌లను భాగస్వామ్యంతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. గుర్రపుడెక్క తొల గింపు, కాలుష్యకారక జలాలు కలవకుండా చూడ డం, డ్రైనేజీ, మురుగునీరు కలవకుండా నిరో ధించడం, కాలుష్య జలాల శుద్ధికి యంత్రాల ఉపయోగం (ట్రీట్‌మెంట్ ప్లాంట్) తదితర పను లు ఎంతో ఖర్చుతో కూడుకొని ఉండడంతో ప్రైవే టు భాగస్వామ్యం తీసుకోవాలని నిర్ణయించారు.

చెరువుకు వెలుపల కుంటను తవ్వుతారు
గుర్రపుడెక్క సమస్య శాశ్వత పరిష్కారానికిగాను బెంగళూరు తరహా విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా కాలువ ద్వారా చెరువులోకి నీరు చేరే మార్గం వద్ద చెరు వుకు వెలుపల ఓ కుంటను తవ్వుతారు. కాలువ ద్వారా వచ్చే నీరు వెట్ ల్యాండ్ సెడిమెంటేషన్ కుంటగా పేర్కొనే ఈ కుంటలోకి చేరిన తరువాత చెరువులోకి పోతుంది. అయితే నీరు చెరువులోకి చేరే క్రమంలో ఈ కుంటలో నీరు ఫిల్టర్ అవు తుంది. అంటే, గుర్రపుడెక్క, ఆయా కలుపు మొక్కల విత్తనాలు ఈ కుంటలో ఉండిపోతాయి. దీంతో ప్రధాన చెరువులో చెత్త పెరగకుండా ఉం టుంది. ఇది బెంగళూరులో సమర్థవంతంగా అమ లవుతుండడంతో దుర్గంచెరువు, ఉప్పల్ నల్ల చెరువు తదితర వాటిల్లో ప్రయోగాత్మకంగా అమ లు చేస్తున్నారు. చెరువులను దత్తత తీసుకోవాలని ఆసక్తిగల వారి కోసం జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో విధి విధానాలు సిద్ధంగా ఉంచినట్లు అధి కారులు తెలిపారు.

205
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...