ఏ ప్లస్ న్యాక్‌గా సాధించారు..


Wed,September 13, 2017 02:39 AM

-ఫలించిన నిరీక్షణ
-న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించిన ఓయూ
-ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉన్నత విద్యాసంస్థలకు గ్రేడింగ్ దేశంలో ఉన్న ఉన్నత విద్యాసంస్థల నాణ్యత, ప్రమాణా లను అంచనావేసి, వాటికి తగిన గ్రేడింగ్ ఇచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 1994లో నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ను బెంగళూరు ప్రధాన కేంద్రంగా స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి న్యాక్ దేశంలోని ఉన్నత విద్యాసంస్థల ప్రమాణాలను పరిశీలించి గ్రేడ్‌లను అంద జేస్తుంది. ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్ అందజేసే గుర్తింపు అయిదేళ్ల పాటు అమలులో ఉంటుంది.

గతంలో అత్యుత్తమ గ్రేడ్‌లు

2001లో మొదటిసారిగా ఓయూకు ఫైవ్‌స్టార్ రేటింగ్ అందజేశారు. ఆ గుర్తింపు అయిదేళ్ల పాటు అమలులో ఉంది. ఆ తరువాత 2008లో ఏ గ్రేడ్ సాధించింది. ఇది 2013 ఫిబ్రవరి వరకు అమలులో ఉంది. ఈ రెండూ అప్ప ట్లో అమలులో ఉన్న అత్యుత్తమ గ్రేడ్‌లు కావడం విశేషం. గతంలో అందించిన గ్రేడ్ 2013 ఫిబ్రవరిలో ముగిసింది. తాజా గ్రేడింగ్‌లలో ఏ ప్లస్ ప్లస్ అత్యుత్తమ గ్రేడింగ్ అయి నప్పటికీ దానిని ఓయూ సాధించలేకపోయింది. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వ, సెంట్రల్ యూనివర్సిటీలకు కూడా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ లేదు. కేవలం మూడు ప్రైవేట్ కళా శాలలు, రెండు డీమ్డ్ యూనివర్సిటీలు మాత్రమే ఈ ఘన త సాధించాయి.

ప్రస్తుతం మారిన నిబంధనలు...

న్యాక్ గుర్తింపులో నిబంధనలను ప్రస్తుతం మార్చివేశారు. విద్యాపరమైన అంశాలు, అధ్యాపకుల బోధన, మూల్యాం కనం, పరిశోధనలు, వసతులు, పచ్చదనం, విద్యార్థుల సహాయానికి చేపట్టిన కార్యక్రమాలు, పరిపాలనా నిర్వహణ, నూతన ఆవిష్కరణలు తదితర అంశాలను పరి శీలించి, వాటికి అనుగుణంగా మార్కులను కేటాయిస్తారు. మొత్తం వెయ్యి మార్కులకు గాను ఆయా విద్యా సంస్థలు పొందిన మార్కులకు క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ)ను లెక్కిస్తారు. అప్పుడు ఆ విద్యాసంస్థకు ఏడు పాయింట్ల స్కేల్‌పై గ్రేడ్‌ను కేటాయిస్తారు. సీజీపీఏ వారిగా విద్యాసంస్థలకు కేటాయించి గ్రేడ్‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
3.76 నుంచి 4.00 వరకు ఏ ప్లస్ ప్లస్
3.51 నుంచి 3.75 వరకు ఏ ప్లస్
3.01 నుంచి 3.50 వరకు ఏ
2.76 నుంచి 3.00 వరకు బీ ప్లస్ ప్లస్
2.51 నుంచి 2.75 వరకు బీ ప్లస్
2.01 నుంచి 2.50 వరకు బీ
1.51 నుంచి 2.00 వరకు సీ
1.51 కంటే తక్కువడీ
డీ హోదా పొందారంటే విద్యాసంస్థలను ప్రమాణాలను తనిఖీ చేసి, ఆ సంస్థలకు గుర్తింపు ఇవ్వడం లేదని అర్థం.ఏకైక రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ ఓయూ
గడిచిన ఆరేళ్లలో దాదాపు రూ.130 కోట్ల విలువైన పరి శోధనా ప్రాజెక్టులను పూర్తి చేయగా ప్రస్తుతం మరో రూ. 30 కోట్ల విలువైన ప్రాజెక్టులపై ఇప్పుడు పనిచేస్తున్నారు. దేశంలోనే యూనివర్సిటీ విత్ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్ (యూపీఈ) హోదా ఉన్న ఏకైక రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ ఓయూ కావడం గమనార్హం. అంతే కాకుండా యూజీసీ, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయం అందించే విభాగాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. సెంటర్ ఫర్ అడ్వాన్సుడ్ స్టడీస్ (సీఏఎస్) గుర్తింపు ఉన్న విభాగాలు అయిదు, డీఎస్‌టీ - ఫిస్ట్ సహాయం అందుకుంటున్న విభాగాలు 14, డీఎస్‌టీ - బీఎస్‌ఆర్ సహాయం అందుకుంటున్న విభాగాలు 17, డీఆర్‌ఎస్ - ఎస్‌ఏపీ హోదా కలిగిన విభాగాలు ఇరవై ఓయూలో ఉన్నాయి. పైగా ఇటీవల శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వర్సిటీకి ప్రభుత్వం రూ.200 కోట్లు ప్రత్యేక నిధులను కేటాయించింది. ఈ నిధుల్లో తొంభైశా తానికి పైగా నిధులను మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకే ప్రణాళికలు రూపొందించారు.

ఆనందంగా ఉంది: ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం

ఓయూకు ఏ ప్లస్ గ్రేడ్ రావడం ఆనం దంగా ఉంది. అందుకు అవసరమైన అన్ని అర్హతలు వర్సిటీకి ఉన్నాయి. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో వర్సిటీకి న్యాక్ గ్రేడింగ్ కీలకంగా మారింది. అందుకే ఆ గుర్తింపు కోసం వర్సిటీ అధ్యాపకులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేసి, అను కున్నది సాధిం చారు. ఇది సమష్టి విజయం. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కినైట్లెంది: ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఐక్యూఏసీ డైరెక్టర్, ఓయూఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించడం ఎంతో ఆనం దంగా ఉంది. దాదాపు సంవత్సరన్న రగా మేము పడ్డ కష్టమంతా ఈ విజ యంతో మర్చిపోయినైట్లెంది. ఈ విజ యం అందరిది. ఇప్పటికే వర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తాజాగా ఈ గ్రేడింగ్ ద్వారా వర్సి టీతో పాటు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం.

జేఎన్‌టీయూహెచ్ వర్సిటీకి న్యాక్రాయితీపై పుస్తకాల విక్రయం

తెలుగుయూనివర్సిటీ: తెలుగు భాష, సాహిత్యం, ప్రామాణికమైన అరు దైన గ్రంథాలను ప్రచురించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా లయం బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రత్యేక రాయితీతో పుస్తకాల విక్రయం చేపట్టినట్లు ప్రచురణల విభాగం ఇన్‌చార్జి డైరెక్టర్ ఆచార్య నిరీక్షణబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాహితీ ప్రియుల కోసం 2010 వరకు ముద్రించిన గ్రంథాలపై 50 శాతం రాయితీ, 2011 నుంచి ఇప్పటివరకు ముద్రించిన గ్రంథాలపై 30 శాతం రాయితీగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల18నుంచి 27వరకు తెలుగు వర్సిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవ నంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తెలుగువర్సిటీ బీఎఫ్‌ఏ కోర్సుకు దరఖాస్తులు

తెలుగు విశ్వవిద్యాలయం లలిత కళాపీఠంలోని శిల్పం, చిత్రలేఖన శాఖలో బీఎఫ్‌ఏ డిగ్రీ కోర్సులో నేరుగా ప్రవేశం పొందడానికి ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తుస్వీకరించడానికి అవకాశం ఉందని రిజిస్ట్రార్ వి.సత్తిరెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు విభాగాధిపతిని 9908119809 నంబర్‌లో సంప్రదించాలన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ : జేఎన్‌టీయూహెచ్ వర్సిటీకి న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లభించిందని వర్సిటీ రిజిస్ట్రార్ ఎన్. యాదయ్య తెలిపారు. ఆగస్ట్ 17 నుంచి 19 తేదీల్లో నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) బృందం వర్సిటీలో వసతులను పరిశీలించిందన్నారు. ఈ మేరకు న్యాక్ బృందం జేఎన్‌టీ యూహెచ్ వర్సిటీకి ఏ గ్రేడ్ సర్టిఫికెట్‌ను ఇవ్వడంపై వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎ. వేణుగోపాలరెడ్డి, రెక్టార్ ఎన్‌వి రమణారావులతో పాటు వర్సిటీ అధికారులు, సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. వర్సిటీకి ఏ గ్రేడ్ గుర్తింపు లభించడంలో కష్టపడిన వర్సిటీ అధ్యాపకులకు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

375
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...