మహేశ్వరంలో..డబుల్ స్పీడ్


Wed,September 13, 2017 02:26 AM

బడంగ్‌పేట నమస్తే తెలంగాణ : మహేశ్వరం నియోజక వర్గంలో 11900 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వీటికోసం రూ.1083.22 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 76.62ఎకరాల స్థలంలో వీటిని నిర్మించనుంది. ఒక్కో ఇల్లు నిర్మాణం చేయడానికి రూ.7.90లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు. జి+3, సి+ఎస్+9 వరకు అంతస్తులలో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించ నుంది. ఇప్పటికే మల్లాపూర్‌లో 2700 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేయడానికి పనులు జరుగుతున్నాయి.

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి చేయనున్నారు. ఈ ఇండ్ల నిర్మాణం బాధ్యతను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. జీహెచ్‌ఎంసీ వారు ఏజెన్సీలకు బాధ్యత ఇచ్చారు. బాలాపూర్ మండల పరిధిలోని మల్లాపూర్, కుర్మల్‌గూడలో, మహేశ్వరం మండలంలోని మన్‌సాన్‌పల్లిలో రెండు చోట్ల, గట్టుపల్లిలో రెండు చోట్ల, గంగపురంలో, మాంకల్‌లో రెండు చోట్ల, మహబత్‌నగర్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం స్థల సేకరణ చేసింది.అందుకు సంబంధించిన లే అవుట్‌ను సిద్ధం చేసింది. దశలవారీగా పనులు ప్రారంభం చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సంవత్సరంలో డబుల్ బెడ్ రూం ఇండ్లుపూర్తి చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం ఉన్న చోటనే ప్రభుత్వ దవాఖాన నిర్మాణం చేస్తున్నారు. అక్కడ ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. కమ్యూనిటీ హల్స్, పార్కులు, విశాలమైన రోడ్లు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి ఇంటికి కృష్ణా వాటర్ సరఫరా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

459
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...