గాంధీ నూతన ఐసీయూలో సాంకేతిక లోపాలు


Wed,September 13, 2017 02:25 AM

-గుర్తించిన ఇంజినీర్లు ... మరమ్మతు పనులు షురూ...
-సేవలు అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజులు
గాంధీదవాఖాన : సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో కొన్ని కోట్లతో నిర్మించిన అధునాతన ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌లో పలు సాంకేతిక సమస్యలను దవాఖాన అధికారులు గుర్తించారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఇంజినీర్లు, అధికారులు పరిశీలించి ఆక్సిజన్ పైప్‌లైన్లు, సెక్షన్ మిషన్ హార్స్ పవర్‌లను పెంచేందుకు అవసరమైన మరమ్మతు పనులు చేపట్టారు. అయితే నూతన ఐసీయూలో సేవలు అందుబాటులోకి రావడా నికి మరికొన్ని రోజులు పట్టనుంది. ఓపి, ఎమర్జెన్సీ భవనాల పై అంతస్తులో రూ.5.18కోట్లతో అత్యంత అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 65 పడకల ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌ను గత నెల 11న రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహాన్ ప్రారంభించారు. వైరస్, బాక్టీరియాలను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు 15 రోజుల పాటు ఫ్యూమిగేషన్ ప్రక్రియ చేపట్టారు. అయితే ఐసీయూను అందుబాటులోకి తేవాలంటే సిబ్బంది కొరత అడ్డంకిగా మారింది. ఓ స్వచ్ఛంద సంస్థ కొంత మంది సిబ్బందిని కేటాయించడంతో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో వైద్య బృందం రెండు రోజుల క్రితం ఐసీయూను పరిశీలించి పలు సాంకేతి క సమస్యలను గుర్తించారు.

లోప్రెషర్‌తో ఆక్సిజన్
ప్రాణపాయస్థితిలో ఉన్న రోగికి ఆక్సిజన్ ఎంతో అవసరం. ఐసీయూల్లోని పడకల వద్దగల ఆక్సిజన్ పైప్‌లైన్ నుంచి 4.5లీటర్ల ఆక్సిజన్ సరఫరా కావాల్సి ఉండగా కేవలం 3.2లీటర్లు మాత్రమే సరఫరా అవుతుంది. ఐసీయూకు ప్రత్యేక ఆక్సిజన్ పైప్‌లైన్ వేయకుండా సన్నటి పైప్ నుంచి ఐసీయూకి కనెక్ట్ చేసినట్లు గుర్తించారు. ఇదే వి ధంగా ఆక్సిజన్ సరఫరా జరిగితే ఇటీవల గోరక్‌పూర్‌లో జరిగిన సంఘటన గాంధీదవాఖానలో పునరావృతం అవుతుందని వైద్యుల బృందం అసహనం వ్యక్తం చేసింది.
ఐసీయూలోని పడకల వద్ద గల సెక్షన్ మిషన్ 10హార్స్ పవర్‌తో ఏర్పాటు చేశారు. దీని కెపాసిటీని 20హెచ్‌పీకి పెంచాలని వైద్య బృందం సూచించింది. సిస్టం పర్‌ఫెక్ట్‌గా ఉంటేనే టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారుల నుంచి ఐసీయూను హ్యాండోవర్ చేసుకుంటామని చెప్పడంతో ఆయా మరమ్మతు పనులు చేపట్టారు.

వారం రోజుల్లో అందుబాటులోకి : గాంధీ సూపరింటెండెంట్
65పడకల నూతన ఐసీయూను వారం రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఐసీయూలో పలు సాంకేతిక సమస్యలను గుర్తించామని, మరమ్మతులు కొనసాగుతున్నాయని వివరించారు. నూతన శానిటేషన్ పాలసీలో భాగంగా 103మంది ట్రాలీబాయ్స్, మరో వందమంది పేషెంట్ కేర్ టేకర్లు అందుబాటులోకి వస్తారని, స్వచ్ఛంద సంస్థ మరి కొంత మంది నర్సింగ్ సిబ్బందిని కేటాయించేందుకు అంగీకరించిందని తెలిపారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...