తల్లిగా మారిన తండ్రి

Wed,September 13, 2017 02:24 AM

-ట్రిపుల్ ఐటీలో ప్రసంగించిన అమెరికా ట్రాన్స్‌జెండర్
శేరిలింగంపల్లి : ట్రాన్స్‌జెండర్‌లూ మనుషులేనని, సమాజంలో జీవించే హక్కు వారికీ ఉందని అమెరికాకు చెందిన ట్రాన్స్‌జెండర్ జెస్సికా లిన్ అన్నారు. ట్రాన్స్‌జెండర్‌ల పట్ల సమాజం చూపుతున్న చిన్నచూపును తొలగిస్తూ ప్రజలలో అవగాహన కల్పించేందుకు లిన్ చేపట్టిన ప్రపంచ పర్యటనలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీకి విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తానకు చిన్నప్పటి నుంచి మగవాడిగా పుట్టినప్పటికి స్త్రీ లక్షణాలు అధికంగా ఉండేవని, ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక తనలో తనే ఎంతో నరకయాతనను అనుభవించానని తెలిపారు.

తనకు వచ్చిన అనుమానంతో 40మంది స్త్రీలతో సెక్స్‌లో పాల్గొన్నానని, వివాహం కూడా చేసుకున్నానని లిన్ తెలిపారు. అయినప్పటికీ తనలో ఉన్న స్త్రీ లక్షణాలు తగ్గకపోవడంతో తాను వివాహం చేసుకున్న వారితో ఈ విషయాన్ని తెలుపగా వారు తనను అసహ్యించుకుని విడాకులు ఇచ్చినట్లు చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. కొద్దికాలం అనంతరం అమెరికాలోని హాస్పిటల్‌లో ట్రాన్స్‌జెండర్ సర్జరీ చేసుకుని మహిళగా మారినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు తెలిసేలా చేయడమే తన లక్ష్యం అంటూ అన్ని దేశాలలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే భారతదేశంలోని 22 పట్టణాల్లో 22 కళాశాలలో ప్రసంగించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

356
Tags

More News

మరిన్ని వార్తలు...