ఆకాశమే హద్దుగా..


Sun,August 13, 2017 12:21 AM

-విద్యార్థులకు పట్టాలు,బంగారు పతకాల ప్రదానం
-సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి: జీవీ ప్రసాద్

గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ట్రిపుల్‌ఐటీ కాన్వొకేషన్ అనంతరం విద్యార్థుల ఆనందహేల

శేరిలింగంపల్లి : బంగారు భవిష్యత్తుకు కలలు కన్నారు.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడి చదివారు.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి.. పట్టుదలతో అనుకున్నది సాధించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడంతో పాలు తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను గుర్తుంచి వారి కళ్లముందు పట్టాలు అందుకోవడం విద్యార్థి జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం. అలాంటి దృశ్యాలకు వేదికైంది గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియం. శనివారం గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) 16వ స్నాతకోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ రెడ్డీల్యాబ్స్ సీఈఓ జీవీ ప్రసాద్ పాల్గొని వివిధ విభాగాల్లో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేశారు.

గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, ట్రిపుల్‌ఐటీ డైరక్టర్ ప్రొఫెసర్ పీజే.నారాయణ, అకాడమిక్స్ డీన్ స్రవంతి శివస్వామిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా తెల్లటి ఖాదీ కుర్తా, పైజామా, పంజాబీ డ్రెస్, చీరలతో పాటు మెడలో కండువాలతో విద్యార్థులు, అధ్యాపకులు హాజరై సరస్వతీ వందనంతో ప్రారంభించారు. తెలుగుదనం ఉట్టిపడేలా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆకట్టుకున్నారు. జీవితంలో ఒడిదుడుకులు సహజమని, కష్ట, సుఖాలను స్వీకరిస్తూ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడే విజయాలు సొంతమవుతాయని డాక్టర్ రెడ్డీల్యాబ్స్ సీఈఓ జీవీ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ ఐటీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు.

బంగారు పతకాల విజేతలు

బీటెక్, డ్యుయల్ డిగ్రీ, ఎంటెక్, ఎంఎస్ (పరిశోధన), పీహెచ్‌డీ, ఎంఎస్‌ఐటీ కోర్సులకు గాను మొత్తం 473 మంది పట్టాలు అందుకున్నారు. 84 మంది రీసెర్చ్ విద్యార్థులు, 16 మంది పీహెచ్‌డీ విద్యార్థులు పట్టాలను అందుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో గౌతమ్ వేప ట్రిపుత్‌ఐటీ గోల్డ్ మెడలిస్టుగా బంగారు పతకాన్ని సాధించాడు. బీటెక్‌లో ఆల్‌రౌండర్‌లుగా సౌజన్య పొనపల్లి, అభిజిత్ జైన్‌లు నిలవగా, గౌతమ్‌వేప (బీటెక్ సీఎస్‌ఈ), ప్రియదర్శిరాథ్ (బీటెక్ ఈసీఈ), గౌరవ్‌మిశ్రా (డ్యుయల్ డిగ్రీ సీఎస్‌ఈ), మోహిత్ శర్మ (ఎంటెక్ సీఎస్‌ఈ), అర్విందర్‌సింగ్ (ఎంటెక్ వీఎల్‌ఎస్‌ఐ అండ్ సీఈ), కౌస్తవ్‌సెంగుప్తా (ఎంటెక్ సీఏఎస్‌ఈ)లు బంగారు పతకాలు సాధించారు.

445
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...