కలెక్టరేట్‌లో క్రీడా పోటీలు


Sun,August 13, 2017 12:11 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మేడ్చల్ కలెక్టరేట్‌లో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పోలీసులకు, విలేకరులకు క్రికెట్, ఇతర కీడ్రా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ మల్లారెడ్డి, కలెక్టర్ ఎంవీ. రెడ్డి పోటీలను ప్రారంభించారు. ముందుగా జరిగిన క్రికెట్ పోటీలలో జిల్లా అధికారుల జట్టు, పోలీసుల జట్టు తలపడగా పోలీసుల జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. తరువాత ప్రజాప్రతినిధుల జట్టు, విలేకరుల జట్టు తలపడగా ప్రజాప్రతినిధుల జట్టు విజయం సాధించింది.అనంతరం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రజాప్రతినిధుల జట్టుపై పోలీసుల జట్టు విజయం సాధించింది. మహిళా ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు మ్యూజికల్ చైర్స్‌తో పాటు పలు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భం గా ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ నిత్యం విధు ల్లో నిమగ్నమయ్యే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులకు క్రీడా పోటీలను నిర్వహించడంపట్ల ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ తరుణ్‌జోషి, జిల్లా జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి, డీఆర్వో సురేందర్‌రావు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

267
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...