విలువలను కొనసాగిస్తేనే మీడియా సంస్థలకు మనుగడ


Sun,August 13, 2017 12:09 AM

- తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య
బంజారాహిల్స్, (నమస్తే తెలంగాణ) : విలువలతో కూడిన కథనాలను ప్రసారం చేయడంతోపాటు నిజాలను నిర్భయంగా చెప్పగలిగే మీడియా సంస్థలకు ఎప్పటికీ మనుగడ ఉంటుందని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం జే 9టీవీ పేరుతో ఏర్పాటు కానున్న చానల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి రోశయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పాత్రికేయ వృత్తి అంటే ఎంతో పవిత్రమైనదనే భావన గతంలో ప్రజల్లో ఉండేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, తెలంగాణ ఫిలించాంబర్ నాయకుడు ప్రతాని రామకృష్ణగౌడ్, సినీనటి కవిత, జే 9టీవీ చైర్మన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

306
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...