మాజీ సైనికుల పిల్లలకు ఉపకార వేతనాలు


Mon,July 17, 2017 02:20 AM

దరఖాస్తులు ఆహ్వానించిన సైనిక సంక్షేమశాఖ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సైన్యంలో పనిచేసి రిటైర్‌మెంట్ పొందిన వారి పిల్లలకు ఉపకార వేతనాలు అందించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ సైనిక సంక్షేమశాఖాధికారి లెఫ్టినెంట్ ప్రవీణ్‌కుమార్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతీయ సైనిక సంక్షేమా ధికారి ఎన్.శ్రీనేష్‌కుమార్‌లు తెలిపారు. మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువుల పిల్లలు ఉపకార వేతనాలను పొందేం దుకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్/ విడోస్ ఆఫ్ ఈఎస్‌ఎం స్కీమ్ కింద ఈ స్కాలర్ షిప్‌లను అందించనున్నామన్నారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు చదు వుతున్న వారికి ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందవచ్చన్నారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, ఈ పథకం కింద ఎంపికైన వారికి ఏడాదికి రూ. 12 వేల స్కాలర్‌షిప్ లభిస్తుందన్నారు. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారికి ఈ పథకం వర్తించదని, వారు ఆగష్టులో ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

దరఖాస్తుల సమర్పణకు చివరితేదీలు
- ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు సెప్టెంబర్ 30, 2017.
- డిగ్రీ చదువుతున్న వారికి అక్టోబర్ 31, 2017.
- మాజీ సైనికులు, హవల్దార్, లేదా దాని కన్నా కింది ర్యాక్‌లో రిటైర్‌మెంట్ పొందిన వారు, ఎయిర్‌ఫోర్స్ లేదా నేవీలో పనిచేసి తత్సమాన ర్యాంక్‌తో రిటైర్‌మెంట్ పొందిన వారి పిల్లలు.
- సాధారణ వృత్తి విద్యాకోర్సులు చేస్తున్న వారికి ఈ పథకం వర్తించదు. వారికి ప్రధాన మంత్రి ఉపకార వేతనం లభిస్తుంది.
- ఇతర గ్రాంట్‌లు, స్కాలర్‌షిప్‌లు పొందుతున్న వారు అనర్హులు.
దరఖాస్తు విధానం..
- ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి.
- www.ksb.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

- మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులు వెబ్‌పోర్టల్‌లోకి వెళ్లి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తదనంతరం వారి మెయిల్‌కు పాస్‌వర్డ్ వస్తుంది. దాని ద్వారా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి స్కీమ్‌ను సెలెక్ట్ చేసుకుని ఫారంను పూర్తిచేసి, ధ్రువపత్రాలను ఆప్‌లోడ్ చేయాలి. తదనంతరం పీడీఎఫ్ ఫారం వస్తుంది. దానిని ప్రింట్ తీసుకుని దానితో పాటు మిగతా సర్టిఫికెట్లను జతపరిచి జిల్లా సైనిక సంక్షేమాధికారి కార్యాలయంలో అందజేయాలి. ఈ దరఖాస్తులు సర్టిఫై చేసుకున్న తర్వాత స్కాలర్‌షిప్‌ల కోసం రికమండ్ చేస్తారు.
జతపరచాల్సిన డాక్యుమెంట్లు.. (డాక్యుమెంట్లు ఒక ఎంబీ సైజులోపు మాత్రమే ఉండాలి)
- డిశ్చార్జ్ పుస్తకం (రాసి ఉన్న అన్ని పేజీలు)
- మాజీ సైనికులు లేదా.. మాజీ సైనిక వితంతువుల యొక్క ఐడెంటిటీ కార్డు.
- పిల్లల మార్కుల మెమోలు (కింది తరగతి వారికి ప్రోగ్రెస్ కార్డు)
- బ్యాంక్ పాసు పుస్తకం మొదటిపేజీ, (తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఎస్‌బీహెచ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉండాలి)
- మాజీ సైనికుడి ఆధార్‌కార్డ్
- పార్ట్ -9 ఆర్డర్ (డిశ్చార్జ్ బుక్‌లోని పిల్లల పేరు మీద ఉన్న పేజీ)
- పిల్లలకు చదువులకు ఎలాంటి గ్రాంట్ ఎక్కడి నుంచి పొందలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం.

మహిళా జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి
చిక్కడపల్లి: మహిళా జనాభా ధామాషా ప్రకారం పార్లమెంట్‌లో రిజర్వేషన్లు కేటాయించాలని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల స్వతంత్రత యువ సమ్మేళనం ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గద్దర్ మాట్లాడుతూ ప్రశ్నించే తత్వాన్ని విజ్ఞానాన్ని అందించేదే విద్య అన్నారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని ఆయ న సూచించారు. మేము ఎంతనో మాకు అంత రిజర్వేషన్ అనే నినాదంతో ముందుకు పోవాలని ఆయన అన్నారు. అమ్మ నిజం నాన్న నమ్మ కం అని అభివర్ణించారు. 50 శాతం ఉన్న మహిళలు ఉద్యోగ, విద్య, రాజకీయంగా అన్ని రంగాల్లో సంగం వాటా అడగాల్సిందే అన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా మహిళాలు మందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గద్దర్ మహిళకు ప్రాధాన్యత తెలుపుతూ పాడిన పాటలు అందరిని ఆలోచింప చేశాయి. ఈ కార్యక్రమంలో ఎన్‌సీపీసీఆర్ మాజీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ శాంత సిన్హా, డాక్టర్.వి.రుక్మిణిరావు, శ్రీరమేష్, లిండా వాన్‌డర్ విజక్, రేఖావజీర్, ఎంవీఎఫ్ ట్రస్టీ కార్యదర్శి ఎం.ఆర్.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

307
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...