పూర్ణిమాసాయి ఆచూకీ లభ్యం


Mon,July 17, 2017 02:16 AM

-ముంబయిలోని ఆశ్రమంలో ఉంటున్నట్లు
గుర్తింపు.... నేడు వెళ్లనున్న పోలీసులు
-40 రోజుల సస్పెన్స్‌కు తెర
- మళ్లీ పుట్టిందంటున్న తల్లిదండ్రులు

దుండిగల్, (నమస్తే తెలంగాణ) : సంచలనం రేపిన పూర్ణిమ సాయి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. 40 రోజుల తర్వాత ముంబయిలోని ఓ అనాథాశ్రమంలో మారుపేరుతో ఉంటున్నట్లు పోలీసులు ఆదివారం గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బాచుపల్లి పోలీసులతో పాటు బాలిక కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం పూర్ణిమా పుట్టినరోజు కావడంతో ఆమె తమకు మళ్లీ జన్మించినట్లుగా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. కాగా సోమవారం ఉదయం బాలిక తల్లిదండ్రులతో పాటు పోలీసులు ముంబయి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు.

అదృశ్యం అయ్యిందిలా....
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతానికి చెందిన చొల్లంగి నాగరాజు, విజయకుమారి దంపతులు బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలోని అమృతసాయి రెసిడెన్సీలోనివాసముంటున్నారు. నాగరాజు రియల్‌ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుండగా, విజయకుమారి గృహిణి. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు పూర్ణిమా సాయి(14) నిజాంపేటలోని బాష్యం పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గతనెల 7వ తేదీ(జూన్ 7న) ఉద యం పూర్ణిమా పాఠశాలకు అని వెళ్లి వెళ్లలేదు. ఈ విషయం కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో ఆందోళనకు గురైన కుటంబసభ్యులు సమీపంలోని బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అదే రోజు సాయంత్రం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆచూకీ దొరికిందిలా....
బాలిక ముంబయిలోని బోయివాడ పోలీసులకు, ఆశ్రమ నిర్వాహకులకు తెలిపిన వివరా ల ఆధారంగా.. అక్కడి ఎస్సై మహాజన్ ఆదివారం సాయం త్రం తుకారాంగేట్ సీఐ రమేష్‌కు ఫోన్‌చేసి వాట్సాఫ్‌లో బా లిక ఫొటో పంపించారు. అయి తే ఇప్పటికే ఈ విషయంలో పెద్ద ఎత్తున ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరగడంతో తుకారాంగేట్ సీఐ రమేష్ బాచుపల్లి సీఐ బాలకృష్ణారెడ్డికి సమాచారం అందించారు. ముంబయి నుంచి పంపిన ఫొటో , పూర్ణిమాసాయి ఫొటోతో సరిపోలడంతో అటు పోలీసులు, ఇటు పూర్ణిమాసాయి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 40 రోజులుగా వేధిస్తున్న మిస్టరీ వీడటంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ జన్మించింది : పూర్ణిమ తండ్రి నాగరాజు
40 రోజుల క్రితం అదృశ్యమైన తమ కూతురు ముంబయిలో సురక్షితంగా ఉన్నట్లు తెలియడంతో నాగరాజు కుంటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఆదివారం పూర్ణిమా పుట్టిన రోజు కూడా కావడం, ఈ రోజే ఆమె సురక్షితంగా ఉన్నట్లు తెలియడంతో తమ కూతురు తమకు మళ్లీ పుట్టినట్లుగా భావోద్వేగానికి గురై కంఠనీరు పెట్టాడు నాగరాజు. ముంబయి పోలీసులు పంపించిన ఫొటో తమ అమ్మాయిదేనన్నారు. ఈ కేసులో తమకు సహకరించిన పోలీసులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

405
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...