దమ్మాయిగూడ దాహం తీరనుంది


Mon,July 17, 2017 02:15 AM

-దమ్మాయిగూడలో నాలుగు రిజర్వాయర్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్..!
- ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి
- ప్రభుత్వ స్థలాన్ని కేటాయించిన అధికారులు
- మరో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో సరఫరా కానున్న మెట్రోవాటర్
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

మేడ్చల్ కలెక్టరేట్ : దమ్మాయిగూడలో నిత్యం పెరుగుతున్న జనాభాతో పాటు నీటి అవసరం కూడ ఎక్కువగానే ఉంది. ఓ వైపు మెట్రో వాటర్ బోర్డు అధికారులు గ్రామంలో ఉన్న అతి పెద్ద నీటి సంపులోకి క్రిష్ణానీటిని సరఫరా చేస్తున్నా కొంత వరకు నీటి సరఫరా సమస్యగానే మారింది. కొన్ని కాలనీల్లో నీరందకపోవడంతో అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఇందుకు శాశ్వత ప్రాదిపదికన గ్రామంలో సుమారు రూ.2 కోట్ల నిధులతో అతి పెద్ద నాలుగు రిజర్వాయర్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

గత వారం పది రోజులుగా మెట్రోవాటర్ బోర్డు అధికారులు, రిజర్వాయర్ నిర్మాణానికి టెండర్‌ను దక్కించుకున్న ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధులు గ్రామంలో కలియ తిరుగుతూ రిజర్వాయర్ నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. మరో ఆరు నెలల్లో ఈ రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నిర్మించి గ్రామానికి మెట్రోవాటర్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మిగతా మూడు రిజర్వాయర్‌ల ఏర్పాటుకు పార్కు, ప్రభుత్వ స్థలాలను అన్వేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అల్వాల్‌లోని ప్రధాన మెట్రోవాటర్ లైన్ ద్వారా జవహార్‌నగర్‌లోని చెన్నపురం గుండా దమ్మాయిగూడకు ఈ నీటిని సరఫరా చేయనున్నారు.

మొదటి రిజర్వాయర్‌కు 1000 గజాల స్థలం
దమ్మాయిగూడలో 4 రిజర్వాయర్‌ల ఏర్పాటుకు మొదట నాసిన్ చెరువు, ఫారెస్టు భూమి పక్కనే ఉన్న స్థలాలను (హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు) హెచ్‌ఎండబ్ల్యూబీ అధికారులు పరిశీలన చేశారు. అక్కడ అనువైన పరిస్థితులు లేకపోవడంతో గ్రామంలో హనుమాన్‌నగర్ కాలనీలోని సర్వే నంబర్ 413లో గల ప్రభుత్వ స్థలంలో మొదటి రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్థానిక పంచాయతీ తీర్మాణంతో రెవెన్యూ అధికారులు ఈ 413 సర్వే నంబర్‌లో రిజర్వాయర్ ఏర్పాటుకు 1000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ల్యాండ్ అలాట్‌మెంట్ ఫైల్ ఆర్డీఓ వద్ద ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ మెట్రో వాటర్ (హెచ్‌ఎండబ్ల్యు) అధికారులకు స్థల కేటాయింపు జారీ ఉత్తర్వులు చేతికందగానే రిజర్వాయర్ నిర్మాణ పనులను యుద్ద ప్రాదిపదికతన చేపట్టడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తున్నారు.

ఎమ్మెల్యే సహకారంతోనే రిజర్వాయర్ ఏర్పాటు
దమ్మాయిగూడ గ్రామంలో నీటి సమస్య తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. మారుతీనగర్‌లోని నీటి సంపునకు రూ.20 లక్షల ఎమ్మెల్యే నిధులు కేటాయించి నిర్మించారు. గ్రామంలో రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు కేటాయించడం ఎంతో అభినందనీయం. మిగిలిన మూడు రిజర్వాయర్‌ల ఏర్పాటుకు స్థానిక పంచాయతీ నుండి పూర్తి సహకారం అందిస్తాం.
పాండాల అనురాధగౌడ్, సర్పంచ్

392
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...