అనీస్ ఉల్ గుర్బాకు మహర్దశ


Mon,June 19, 2017 04:28 AM

-రూ. 20 కోట్ల వ్యయంతో మల్టీ స్టోరర్ కాంప్లెక్స్ నిర్మాణం
-అనాథ బాలలకు విద్యను అందించాలన్నదే ఆశయం

బేగంబజార్, జూన్ 18 : అనాథ బాలలకు విద్యను అందించాలన్న సంకల్పంతో నిజాం హయాంలో ప్రారంభమైన అనీస్ ఉల్ గుర్బా అనాథ బాలల శరణాల యాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభివృద్ధి పనుల ప్రారంభించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వంద సంవత్సరాల క్రితం అనాధ బాలల విద్యా వికాసానికి నిజాం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చేందుకు గాను ప్రారంభమైన అనాధాశ్రమానికి నాంపల్లిలోని 20 కోట్ల వ్యయం తో ముస్లిం అనాధ పిల్లలకు ఆశ్రయంతో పాటు కార్పొరేట్ విద్య అందించేందుకు గాను మల్టీ స్టోరర్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు ముందుకు రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వెనకబడిన ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వందేళ్ల చరిత్ర కలిగిన అనాధ ఆశ్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేయూత కల్పించడం హర్షనీయమని వక్ఫ్‌బోర్డు సభ్యులు సీఎం కేసీఆర్‌కు అభి నందనలు తెలుపుతున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అనాధ ముస్లిం పిల్లలకు విద్యతో పాటు ఉండటానికి అత్యాధునిక స్థాయి లో డార్మిటరి గదులను అందించేం దుకు కృషి చేయడం పట్ల చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు అంతస్తులలో భవన నిర్మాణం


వందేళ్ల చరిత్ర కలిగిన అనీస్ ఉల్ గుర్బా నగరంలోని నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపాన శిధిలావస్తకు చేరుకోవడంతో గతంలో ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి పరిచేందుకు గాను ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం అనాధ ముస్లిం బాలలకు కార్పొరేట్ తరహాలో విద్యను అందించే లక్ష్యంతో 20కోట్ల నిధులను కేటాయించి జీ ప్లస్ 1లో వాణిజ్య వ్యాపార కేంద్రంగా, రెండవ అంత స్తులో బాలురకు ప్రార్ధన హాల్, డైనింగ్ హాల్, డార్మెంటరి గదులను అదే విధంగా బాలికలకు డైనింగ్ హాల్‌తో పాటు డార్మెంటరి గదులను నిర్మించడం జరుగుతుంది. మూడు, నాలుగు, ఐదు, ఆరు అంతస్తులలో బాలుర, బాలికలకు విడి విడిగా గదు లను కేటాయించడంతో పాటు గ్రూప్1, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా, ఇక్కడే ఉండి మంచి ఉపాధిని పొందేందుకు గాను సుమారు 500మంది బాల బాలికలకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు.

అనీస్ ఉల్ గుర్బాకు ఎంతో చరిత్ర


నిజాం హయాంలో ప్రారంభమైన అనీస్ ఉల్ గుర్బా స్వాతంత్య్రం అనంతరం దేవాదాయ శాఖ పరిధిలో కొనసాగింది. తదనంతరం స్టేట్ వక్ఫ్‌బోర్డులో విలీనం కావడంతో ప్రస్తుతం వక్ఫ్‌బోర్డు ఆధీనంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ అనా ధాశ్రమంలో 60మంది అనాధ చిన్నారులు విద్యతో పాటు ఆశ్రయాన్ని పొందు తున్నారు. దాతల సహకారంతో ఈ చిన్నారులకు కార్పొరేట్ విద్యను అంది స్తున్నామని అనాధాశ్రమ ఈఓ అలీబాజహర్ పేర్కొన్నారు. తమ అనాథశ్రమాన్ని అత్యంత సుందరీకరంగా తీర్చిదిద్దేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కృషి చేయడం పట్ల అనాధ ముస్లిం చిన్నారులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం అనాధాశ్రమ స్థలంలో మల్టీ స్టోరర్ కాంప్లెక్స్ నిర్మాణ శంఖుస్థాపనకు విచ్చేసిన సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అంతే కాకుండా ఆ చిన్నారులతో కలిసి సీఎం కేసీఆర్ శంఖుస్థాపన చేయడం ప్రతిఒక్కరిని ఆకర్శించింది.

683
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...