ఒక్క రక్తం బొట్టుతోనే రొమ్ము క్యాన్సర్ గుర్తింపు


Mon,June 19, 2017 04:23 AM

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: రొమ్ముక్యాన్సర్ నిర్ధారణ ఇక నుంచి సాధారణ ప్రజ లకు తక్కువ ధరలో అందుబాటులోకి రానున్నాయి. అంతే కాకుండా ఎలాంటి మొహమాటం లేకుండా రొమ్ము క్యాన్సర్ పరీక్షలను యువతులు, మహిళలు చే యించుకునే వెలుసుబాటు రానుంది. మొన్నటి వరకు రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేయించాలంటే మమోగ్రామ్ స్కానింగ్ చేయాల్సి వచ్చేది. ఈ స్కానింగ్ చేయ డానికి రూ.3వేల నుంచి రూ.5వేలు ఖర్చవుతుంది. అంతే కాకుండా యువతులు, మహిళలు ఈ స్కానింగ్ చేయించుకోవడానికి సిగ్గుపడేవారు. దీంతో చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ పరీక్షలకు దూరంగా ఉంటూ వ్యాధి పూర్తిగా ముదిరిన తరువాత దవాఖానలకు పరుగులు తీయడం ఆనవాయితీగా వస్తోంది. ఫలితంగా దేశంలో ఏడాదికి 1.5లక్షల మంది రొమ్ము క్యాన్సర్‌కు గురవుతుండగా వారిలో ఏటా 70వేల మంది మృత్యువాత పడుతున్నట్లు ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రధాన పరిశోధకులు తెలిపారు. బాధితుల్లో 60శాతం మంది రోగులు వ్యాధి ముది రిన తరువాతనే దవాఖానలను ఆశ్రయించడంతో మరణాల సంఖ్య అధికం గా ఉన్నట్లు వివరించారు. దీనికి ప్రధాన కారణం రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష ఖరీదైనది కావడం, పరీక్ష చేయించుకోవడానికి యువతులు, మహిళలు సిగ్గు పడటం, అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలుగా వివరించారు.

ఒక్క రక్తం బొట్టుతోనే పరీక్షలు
కేవలం ఒక్క రక్తం బొట్టుతోనే ఇక నుంచి రొమ్ముక్యాన్సర్‌ను నిర్ధారించవచ్చని డా.రఘురామ్ తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో తయారైన మమో అలర్ట్ యంత్రంతో ఈ పరీక్షలు జరుపుతారన్నారు. దీని ఖరీదు కేవలం 1.5లక్షలు (1500డాలర్లు), ఈ పరీక్ష చేయించుకోవడానికి కేవలం 130రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని ఆయన వివరించారు.

పరీక్ష జరిపే విధానం
మహిళల నుంచి సాధారణ రక్త పరీక్షల మాదిరిగానే ఒక రక్తం బొట్టును సేకరించి మమో అలర్ట్ యంత్రంలోని సీడీపై వేసి పరీక్ష జరుపుతారని డా.రఘురామ్ తెలి పారు. సీడీ తిరుగుతున్నప్పుడు దానిపై బ్రెస్ట్ క్యాన్సర్ స్పెసిఫిక్‌కు సంబంధించి నాలుగు బయోమార్క్స్ ఏర్పడితే సదరు మహిళ లేదా యువతికి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారిస్తారని, సాధారణ బయోమార్క్స్ ఉంటే వారికి వ్యాధి లేనట్లుగా పరిగణిస్తారని ఆయన వివరించారు. ఈ సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరీక్ష ద్వారా బాధితుల్లో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి వారి ప్రాణాలు కాపాడవచ్చని ఆయన తెలిపారు.

క్లినికల్ ట్రయల్ ప్రారంభం
ఇప్పటికే అమెరికాలో విజయవంతంగా 300మంది రోగులపై పరీక్షలు జరిపిన మమో అలర్ట్ పరీక్షలు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభం కానున్నట్లు డా.రఘురామ్ తెలిపారు. అమెరికాలోని పీఓసీ మెడికల్ సిస్టమ్ సంస్థతో ఉషాలక్ష్మీ ఫౌండేషన్ మమోఅలర్ట్ పరీక్షలకు సంబంధించి క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఇప్పటికే దేశంలోని 7ప్రాంతాల్లో 2400మందిపై ఈ క్లీనికల్ ట్రయల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో ఢిల్లీ, కోల్‌కత్తా, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలున్నట్లు డా.రఘురామ్ వివరించారు. తెలంగాణలో కిమ్స్, ఉషాలక్ష్మీ బ్రెస్ట్‌క్యాన్సర్ ఫౌండేషన్, ఇండో అమెరికా క్యాన్సర్ దవాఖానల భాగస్వామ్యంతో క్లీనికల్ ట్రయల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 6నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం ఈ పరీక్షలను ప్రభుత్వ అనుమతితో అధికారికంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు.

మమో అలర్ట్ యంత్రాల తయారీకి స్పందించిన మంత్రి
అమెరికాలోని కాలిఫోర్నియాలో తయారవుతున్న మమో అలర్ట్ యంత్రాలను దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పంధించినట్లు డా.రఘురామ్ తెలిపారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మమో అలర్ట్ పరీక్షలను పైలెట్ ప్రాజెక్ట్‌గా నిర్వహించేందుకు కూడా మంత్రి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు.

273
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...