హిజ్రాల వేషంలో బలవంతపు వసూళ్లు


Mon,June 19, 2017 04:21 AM

చర్లపల్లి : హిజ్రాల వేషంలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న 11 మందితో పాటు మరో నలుగురు ఆటో డ్రైవర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ సయ్యద్ రఫీక్ కథనం ప్రకారం ... కాప్రా సర్కిల్ కుషాయిగూడ, వాసవీశివనగర్ కాలనీ మారుతీ గార్డెన్ వద్ద పోతన సుబ్బారావు అనే వ్యక్తి ఆదివారం గృహాప్రవేశం చేశారు. కాగా బోడుప్పల్, కాకతీయ కళానగర్‌కు చెందిన 11 మందితోపాటు ఆటో డ్రైవర్లు హిజ్రాల వేషంలో నూతన గృహ ప్రవేశం వద్దకు వెళ్లి యజమాని సుబ్బారావును రూ.30వేలు డిమాండ్ చేశారు. దీంతో సుబ్బారావు తన వద్ద డబ్బులు లేవని చెప్పినా నిందితులు వినకుండా అతని జేబులోంచి రెండు వేలనుబలవంతంగా లాక్కున్నారు. దీంతో సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సాదుల లక్ష్మయ్య(30), తూర్పాటి సత్యం(23), మొట్టెం హనుమంత్(69), కళ్యం నర్సింహ(32), సాదుల శ్రీనివాస్(43), సాదుల విజేయ్(20), తిరుపతి మహేష్(21), కళ్యం రమేష్(24), కత్తెర బాల్‌శెట్టి(75), కప్పెర కిష్టయ్య(48), కప్పెర యాదగిరి(39)లతో పాటు నలుగురు డ్రైవర్లు కళ్యం సురేష్(27), మొట్టెం శ్రీను(30), మొట్టేం ప్రసాద్(20), కైతోజు నారాయణ(40)లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు వేల నగదుతో పాటు నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ హిజ్రాల వేషంలో బలవంతపు వసుళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

441
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...